621 మందికి ఇందిరమ్మ ఇళ్ల మంజూరు పత్రాలు.. 179 మందికి రూ.53.69 లక్షల సీఎంఆర్ఎఫ్ ఆర్థిక సహాయం
పోచారం శ్రీనివాసరెడ్డి చేతుల మీదుగా లబ్ధిదారులకు పత్రాలు, చెక్కుల పంపిణీ
బాన్సువాడ, నవంబర్ 19 (E6tv NEWS: శివ ఠాకూర్).
పేదల సొంతింటి కలను సాకారం చేయడంతో పాటు, అనారోగ్య సమస్యలతో ఆర్థిక ఇబ్బందులు ఎదుర్కొంటున్న కుటుంబాలకు అండగా నిలిచేందుకు ప్రజాప్రతినిధులు కృషి చేయాలని తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వ వ్యవసాయ సలహాదారు, బాన్సువాడ ఎమ్మెల్యే పోచారం శ్రీనివాసరెడ్డి పేర్కొన్నారు. బాన్సువాడ నియోజకవర్గ పరిధిలో ఒకే రోజు ఇందిరమ్మ ఇళ్ల మంజూరు పత్రాలు, ముఖ్యమంత్రి సహాయ నిధి చెక్కులను లబ్ధిదారులకు పంపిణీ చేశారు.
621 మంది పేదలకు ఇందిరమ్మ ఇళ్ల మంజూరు పత్రాలు
వర్ని మండల కేంద్రంలోని జనరల్ ఫంక్షన్ హాల్లో నిర్వహించిన కార్యక్రమంలో వర్ని, కోటగిరి, పోతంగల్, రుద్రూర్, చందూర్, మోస్రా మండలాలకు చెందిన 621 మంది అర్హులైన లబ్ధిదారులకు ఇందిరమ్మ ఇళ్ల మంజూరు పత్రాలను పోచారం శ్రీనివాసరెడ్డి అందజేశారు. ఈ కార్యక్రమంలో రాష్ట్ర మాజీ ఆగ్రోస్ చైర్మన్ కాసుల బాలరాజు పాల్గొన్నారు.
మండలాల వారీగా ఇందిరమ్మ ఇళ్ల మంజూరు వివరాలు:
- వర్ని – 151 మంది
- కోటగిరి – 101 మంది
- పోతంగల్ – 96 మంది
- రుద్రూర్ – 195 మంది
- చందూర్ – 26 మంది
- మోస్రా – 52 మంది
179 మందికి రూ.53.69 లక్షల సీఎంఆర్ఎఫ్ సాయం
అనంతరం బాన్సువాడ పట్టణంలోని తన నివాసం వద్ద నియోజకవర్గానికి చెందిన 179 మంది ముఖ్యమంత్రి సహాయ నిధి (CMRF) లబ్ధిదారులకు మొత్తం రూ.53,69,000 విలువైన చెక్కులను పంపిణీ చేశారు.ఈ సందర్భంగా పోచారం శ్రీనివాసరెడ్డి మాట్లాడుతూ.. వైద్య చికిత్సల కోసం అప్పులు చేసి ఆర్థిక ఇబ్బందులు ఎదుర్కొంటున్న పేద, మధ్యతరగతి కుటుంబాలకు ముఖ్యమంత్రి సహాయ నిధి ఎంతో అండగా నిలుస్తోందన్నారు. అర్హులైన ప్రతి ఒక్కరికీ ప్రభుత్వ సహాయం అందేలా కృషి చేస్తున్నామని తెలిపారు.
మండలాల వారీగా సీఎంఆర్ఎఫ్ లబ్ధిదారుల వివరాలు: మండలం లబ్ధిదారులు సహాయం బాన్సువాడ పట్టణం 19 ₹5,02,500 బాన్సువాడ గ్రామీణం 25 ₹7,62,000 నస్రుల్లాబాద్ 15 ₹5,10,500 బీర్కూర్ 14 ₹5,19,000 కోటగిరి 10 ₹2,70,000 పోతంగల్ 18 ₹5,76,500 రుద్రూర్ 14 ₹2,01,500 వర్ని 40 ₹12,74,500 చందూర్ 11 ₹4,48,500 మోస్రా 12 ₹2,90,000 ఇతరులు 1 ₹14,000 మొత్తం179₹53,69,000
ఈ కార్యక్రమాల్లో బాన్సువాడ నియోజకవర్గ ప్రజాప్రతినిధులు, కాంగ్రెస్ పార్టీ నాయకులు, కార్యకర్తలు, లబ్ధిదారులు తదితరులు పాల్గొన్నారు.




