జుక్కల్, సెప్టెంబర్ 21:(E6tv NEWS: ప్రతినిధి)
జుక్కల్ మండలం కంఠల్లి గ్రామానికి చెందిన కాంగ్రెస్ పార్టీ సీనియర్ నాయకులు భీమ్రావు పటేల్ అంత్యక్రియలు ఆదివారం కుటుంబ సభ్యులు, బంధువులు, కాంగ్రెస్ పార్టీ నాయకులు, కార్యకర్తల సమక్షంలో నిర్వహించారు. ఈ అంత్యక్రియల్లో జుక్కల్ నియోజకవర్గ మాజీ ఎస్సీ సెల్ చైర్మన్, మాజీ ప్రచార కమిటీ సభ్యుడు సౌదగర్ అరవింద్ పాల్గొన్నారు.ఈ సందర్భంగా భీమ్రావు పటేల్ పార్థివదేహాన్ని మోసి అంతిమయాత్రలో పాల్గొని నివాళులర్పించారు. కాంగ్రెస్ పార్టీకి ఆయన అందించిన సేవలను ఈ సందర్భంగా పలువురు నాయకులు స్మరించుకున్నారు. భీమ్రావు పటేల్ మృతి పార్టీకి, గ్రామానికి తీరని లోటని పేర్కొన్నారు. కుటుంబ సభ్యులకు ప్రగాఢ సానుభూతి తెలిపారు.
