Breaking News

హుడా కాలనీలో ఉచిత వైద్య శిబిరం

శేర్లింగంపల్లి, సెప్టెంబర్ 21:(E6tv NEWS: ప్రతినిధి)

శేర్లింగంపల్లి నియోజకవర్గ పరిధిలోని హుడా కాలనీలో గణేష్ ఉత్సవ కమిటీ ఆధ్వర్యంలో నిర్వహిస్తున్న గణేష్ నవరాత్రి ఉత్సవాల్లో భాగంగా సోమవారం గణేష్ మండపం వద్ద ఒమేగా పీఆర్‌కే హాస్పిటల్ ఆధ్వర్యంలో ఉచిత వైద్య శిబిరాన్ని నిర్వహించారు.ఈ వైద్య శిబిరానికి భక్తులు, స్థానికులు అధిక సంఖ్యలో హాజరై బీపీ, షుగర్, ఈసీజీ తదితర వైద్య పరీక్షలు చేయించుకున్నారు. గణేష్ మండపం వద్ద ఉచిత వైద్య సేవలు అందుబాటులోకి తీసుకురావడంపై భక్తులు, స్థానికులు సంతోషం వ్యక్తం చేసినట్లు ఉత్సవ కమిటీ సభ్యులు తెలిపారు.

ఈ కార్యక్రమంలో పాల్గొన్న ఒమేగా పీఆర్‌కే హాస్పిటల్ జనరల్ ఫిజీషియన్ డాక్టర్ జీవన్ సాయితో పాటు హాస్పిటల్ సిబ్బంది కృష్ణ, సందీప్లను గణేష్ ఉత్సవ కమిటీ సభ్యులు శాలువాలతో సత్కరించారు.ఈ కార్యక్రమంలో దుర్గా నరేందర్, ఆకాష్ గౌడ్, శ్రీనివాస్, ధీరజ్, రవిశంకర్, విజయ్, గణేష్, రోహిత్, భాను, చందర్, వసంత్, భరత రాజ్, కృష్ణ, గౌరీ తదితర కమిటీ సభ్యులు పాల్గొన్నారు.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *