Breaking News

భీంగల్‌ లక్ష్మీనరసింహస్వామిని దర్శించుకున్న రష్మీ గౌతమ్

భీంగల్, సెప్టెంబర్ 21:(E6tv NEWS: ప్రతినిధి).

ప్రముఖ యాంకర్, నటి రష్మీ గౌతమ్ సోమవారం నిజామాబాద్ జిల్లా భీంగల్‌లోని శ్రీ లింబాద్రి లక్ష్మీనరసింహస్వామి ఆలయాన్ని సందర్శించారు. ఈ సందర్భంగా స్వామివారిని దర్శించుకుని ప్రత్యేక పూజలు నిర్వహించారు.

ఆలయ అర్చకులు ప్రణీత్ పంతులు, విష్ణు పంతులు, నర్సయ్య పంతులు, నారాయణ పంతులు రష్మీ గౌతమ్‌తో ప్రత్యేక పూజలు నిర్వహించారు. అనంతరం స్వామివారి ఆశీస్సులు పొందిన ఆమె ఆలయ మహిమ, విశిష్టత గురించి తెలుసుకుని కొంత సమయం భక్తి భావంతో గడిపారు.ఈ సందర్భంగా ఆలయానికి వచ్చిన భక్తులు రష్మీ గౌతమ్‌ను ఆప్యాయంగా కలుసుకున్నారు. ఆమె వెంట యోగేశ్వర్, నర్సయ్య, చింటూ, చందు, సురేష్ తదితరులు ఉన్నారు. శ్రీ లక్ష్మీనరసింహస్వామి వారి కృప భక్తులందరిపై ఉండాలని ఈ సందర్భంగా ఆకాంక్షించారు.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *