Breaking News

లంచం తీసుకోకపోతే పని కాదా?:మంచిర్యాల ఏసీబీ రైడ్‌లో జీపీవో, అనుచరుడు!

మంచిర్యాల జిల్లా పెద్దపేట గ్రామంలో అవినీతి నిరోధక శాఖ (ACB) అధికారులు మెరుపు దాడి చేసి, లంచం తీసుకుంటుండగా గ్రామ పరిపాలనా అధికారి (GPO) దుర్గాప్రసాద్‌తో పాటు అతని అనుచరుడు పోతు రాజేందర్‌ను రెడ్ హ్యాండెడ్‌గా అరెస్ట్ చేశారు. భూ బదిలీ క్రమబద్ధీకరణతో పాటు పట్టాదారు పాస్‌పుస్తకాలు మంజూరు చేసేందుకు గానూ అధికారికంగా సహకరించడానికి జీపీవో దుర్గాప్రసాద్ ఫిర్యాదుదారుడి నుంచి రూ. 1.30 లక్షల లంచం డిమాండ్ చేశాడు. అందులో భాగంగా మొదటి విడతగా రూ. 80,000 చెల్లించాలని, మిగతా రూ. 50,000 పని పూర్తయ్యాక ఇవ్వాలని సూచించాడు. బాధితుడు ఏసీబీని ఆశ్రయించడంతో పక్కా ప్రణాళికతో అధికారులు దాడులు నిర్వహించారు. పెద్దపేట పరిధిలోని వ్యవసాయ పొలాల సమీపంలో జీపీవో దుర్గాప్రసాద్, అతని అనుచరుడు రాజేందర్ బైక్‌పై వచ్చి, ఫిర్యాదుదారుడి నుంచి రూ. 80,000 లంచం సొమ్మును రాజేందర్ ద్వారా స్వీకరిస్తుండగా ఏసీబీ అధికారులు పట్టుకున్నారు. నిందితుడి చేతులకు నిర్వహించిన కెమికల్ టెస్ట్‌లో పాజిటివ్‌గా తేలడంతో బాధితుడి నుంచి సేకరించిన డబ్బును స్వాధీనం చేసుకుని, జీపీవో దుర్గాప్రసాద్, రాజేందర్‌లపై కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నారు.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *