Breaking News

జర్నలిస్ట్ బసవరాజుపై కేసులు ఎత్తివేయాలి

మాజీ జడ్పీ చైర్మన్, బీఆర్‌ఎస్ రాష్ట్ర కార్యదర్శి దాదాన్నగారి విఠల్‌రావు డిమాండ్

నిజామాబాద్, సెప్టెంబర్ 23: (E6tv NEWS: ప్రతినిధి).

జర్నలిస్ట్ బసవరాజుపై నమోదు చేసిన కేసులను తక్షణమే ఎత్తివేయాలని మాజీ జడ్పీ చైర్మన్, బీఆర్‌ఎస్ రాష్ట్ర కార్యదర్శి దాదాన్నగారి విఠల్‌రావు ప్రభుత్వాన్ని, పోలీస్ శాఖను డిమాండ్ చేశారు.

ఈ సందర్భంగా విఠల్‌రావు మాట్లాడుతూ.. ప్రజలకు, ప్రభుత్వానికి మధ్య మీడియా నిరంతరం వారధిగా పనిచేస్తూ ప్రజా సమస్యలను వెలుగులోకి తీసుకువస్తుందని అన్నారు. కేంద్ర ప్రభుత్వ ఉపాధి హామీ పథకంలో జరుగుతున్నట్లు పేర్కొన్న అవకతవకలపై కథనం ప్రచురించినందుకే స్టాఫ్ రిపోర్టర్ బసవరాజుపై కేసులు నమోదు చేసి రిమాండ్‌కు తరలించారని ఆయన ఆరోపించారు.వాస్తవాలను వెలుగులోకి తీసుకువచ్చే పాత్రికేయులపై కేసులు నమోదు చేయడం సరికాదని విఠల్‌రావు పేర్కొన్నారు. ఫిర్యాదులపై సమగ్రంగా విచారణ జరిపి వాస్తవాలను నిర్ధారించిన అనంతరం చట్టపరమైన చర్యలు తీసుకోవాలని సూచించారు.

బసవరాజుపై నమోదైన కేసులను వెంటనే ఉపసంహరించుకోవాలని, భవిష్యత్తులో పాత్రికేయులు తమ విధులను స్వేచ్ఛగా నిర్వహించుకునేలా ప్రభుత్వం, పోలీస్ శాఖ చర్యలు తీసుకోవాలని విఠల్‌రావు డిమాండ్ చేశారు.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *