నిర్మల్, సెప్టెంబర్ 25:(E6tv NEWS: ప్రతినిధి).
సెప్టెంబర్ 25న నిర్మల్ పట్టణంలో జరగనున్న గణేష్ నిమజ్జన కార్యక్రమానికి పటిష్టమైన భద్రతా ఏర్పాట్లు చేపట్టాలని బాసర జోన్–2 డీఐజీ ఆర్. భాస్కరన్, IPS పోలీస్ అధికారులను ఆదేశించారు.
బుధవారం నిర్మల్ జిల్లా పర్యటనకు వచ్చిన డీఐజీకి జిల్లా ఎస్పీ డా. జి. జానకి షర్మిల, IPS పూల మొక్క అందించి స్వాగతం పలికారు. అనంతరం డీఐజీ పోలీసుల గౌరవ వందనం స్వీకరించారు.ఈ సందర్భంగా గణేష్ నిమజ్జన ఏర్పాట్లపై పోలీస్ అధికారులతో డీఐజీ సమీక్ష నిర్వహించారు. నిమజ్జన శోభాయాత్ర మార్గాలు, బందోబస్తు, ట్రాఫిక్ నియంత్రణ, సీసీ కెమెరాల ద్వారా పర్యవేక్షణ, భక్తులు, ప్రజల భద్రత తదితర అంశాలపై అధికారులకు పలు సూచనలు చేశారు.
అనంతరం బాసరలో గణేష్ నిమజ్జనం జరిగే ప్రాంతాలను డీఐజీ క్షేత్రస్థాయిలో పరిశీలించారు. నిమజ్జన కార్యక్రమాలు ఎలాంటి అవాంఛనీయ ఘటనలకు తావులేకుండా ప్రశాంతంగా, సురక్షితంగా జరిగేలా అవసరమైన ఏర్పాట్లను ముందుగానే పూర్తి చేయాలని అధికారులను ఆదేశించారు.ఈ కార్యక్రమంలో భైంసా ఏఎస్పీ సాయి కిరణ్, IPS, బాసర SHO/CI దీపక్, SI శ్రీకాంత్ తదితర పోలీస్ అధికారులు పాల్గొన్నారు.


