Breaking News

బడా గణేష్ బందోబస్తుపై సీపీ రివ్యూ…

హైదరాబాద్ నగరంలో వినాయక నిమజ్జనోత్సవాలు, శోభాయాత్రలను అత్యంత ప్రశాంత వాతావరణంలో, వైభవంగా నిర్వహించేందుకు పోలీస్‌ శాఖ తరఫున పకడ్బందీ భద్రతా ఏర్పాట్లు చేపట్టినట్లు నగర పోలీస్‌ కమిషనర్‌ శ్రీ వీసీ సజ్జనర్‌ తెలిపారు. శనివారం ఉన్నతాధికారులతో కలిసి ఖైరతాబాద్‌ బడా గణేశుడి వద్ద ప్రత్యేక పూజలు నిర్వహించిన ఆయన, అనంతరం నిమజ్జన సన్నాహాలను క్షేత్రస్థాయిలో పరిశీలించారు. ఖైరతాబాద్‌ మహాగణపతితో పాటు బాలాపూర్‌ నుంచి హుస్సేన్‌సాగర్‌ వరకు సాగే ప్రధాన శోభాయాత్ర ప్రశాంతంగా సాగేలా జీహెచ్‌ఎంసీ, విద్యుత్‌, జలమండలి వంటి శాఖలతో సమన్వయం చేసుకుంటూ ముందస్తు ప్రణాళికలు రూపొందించామని చెప్పారు. బందోబస్తు కోసం సుమారు 20 వేల మంది పోలీస్ సిబ్బందిని కేటాయించామని, ప్రధాన మార్గాల్లోని 10 వేల సీసీ కెమెరాలను బంజారాహిల్స్‌లోని కమాండ్ కంట్రోల్ సెంటర్‌కు అనుసంధానించి నిరంతరం పర్యవేక్షిస్తున్నామని వివరించారు. మహిళల భద్రత కోసం 26 ‘షీ-టీమ్స్’ బృందాలు పనిచేస్తున్నాయని, ప్రజలు ట్రాఫిక్ మార్గదర్శకాలను పాటిస్తూ శాంతియుతంగా పండుగ జరుపుకోవాలని సీపీ కోరారు.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *