Breaking News

గాయపడిన గర్భిణి జింక.. కాపాడిన స్థానికులు!

తూర్పుగోదావరి జిల్లా దేవరపల్లి మండలం యాదవోలు గ్రామంలో మానవత్వం పరిమళించిన ఘటన చోటుచేసుకుంది. ఇటీవలి భారీ వర్షాల కారణంగా అడవి నుంచి దారి తప్పి పొలాల మీదుగా గ్రామంలోని ఎస్సీ ఏరియాలోకి వచ్చిన ఒక చుక్కల జింకపై గ్రామ వీధి కుక్కలు ఒక్కసారిగా విరుచుకుపడ్డాయి.

కంచిలో చిక్కుకున్న జింకకు ప్రథమ చికిత్స: సుమారు 10 వీధి కుక్కలు మూకుమ్మడిగా దాడి చేయడంతో భయంతో పరుగులు తీసిన చుక్కల జింక సమీపంలోని కంచి (కంపచెట్లు) లో చిక్కుకుపోయింది. తీవ్రంగా గాయపడటంతో పాటు జింక కాలు విరిగిపోవడాన్ని స్థానికులు గమనించారు. అంతేకాకుండా ఆ జింక గర్భంతో ఉందనే విషయాన్ని గుర్తించిన గ్రామస్థులు వెంటనే స్పందించి, కుక్కలను తోలేసి జింకను సురక్షితంగా బయటకు తీశారు. మానవత్వంతో స్పందించిన స్థానికులు దానికి ప్రథమ చికిత్స అందించారు.

అధికారులకు సమాచారం: గర్భంతో ఉన్న చుక్కల జింక ప్రాణాలను కాపాడేందుకు స్థానికులు వెంటనే అటవీశాఖ (ఫారెస్ట్) మరియు పోలీసు అధికారులకు సమాచారం అందించారు. సమాచారం అందుకున్న అధికారులు హుటాహుటిన సంఘటనా స్థలానికి చేరుకుని జింకను స్వాధీనం చేసుకుని, మెరుగైన వైద్య చికిత్స కోసం వెటర్నరీ ఆసుపత్రికి తరలించే ఏర్పాట్లు చేశారు. స్థానికులు చూపిన సమయస్ఫూర్తి, జంతుప్రేమపై పలువురు ప్రశంసలు కురిపిస్తున్నారు.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *