ప్రమాదాల నివారణ, సురక్షిత డ్రైవింగ్‌పై ప్రత్యేక శిక్షణ
ఇంధన పొదుపుపై డ్రైవర్లకు కీలక సూచనలు
డ్రైవింగ్ సమయంలో సెల్‌ఫోన్, మద్యం పూర్తిగా నిషేధం
నిజామాబాద్, సెప్టెంబర్ 25: (E6tv NEWS: ప్రతినిధి).
తెలంగాణ రాష్ట్ర రోడ్డు రవాణా సంస్థ (టీజీఎస్ఆర్టీసీ) నిజామాబాద్ రీజియన్ ఆధ్వర్యంలో డ్రైవర్లకు రోడ్డు భద్రత, ప్రమాదాల నివారణ, సురక్షిత డ్రైవింగ్‌తో పాటు ఇంధన పొదుపుపై ప్రత్యేక శిక్షణ కార్యక్రమం నిర్వహించారు. నిజామాబాద్ రీజియన్ కార్యాలయ కాన్ఫరెన్స్ హాల్లో జరిగిన ఈ కార్యక్రమం రీజియన్ మేనేజర్ ఆధ్వర్యంలో నిర్వహించారు.
ఈ సందర్భంగా ఇంపాక్ట్ ఫౌండేషన్‌కు చెందిన సైకాలజిస్ట్ వి. ప్రవీణ్, నిజామాబాద్-1 డిపో మేనేజర్ ఎం. వెంకటరమణ డ్రైవర్లకు పలు కీలక సూచనలు చేశారు. డ్రైవింగ్ సమయంలో ఏకాగ్రత, దృశ్య అవగాహన, మానసిక ప్రశాంతత ఎంతో ముఖ్యమని తెలిపారు. డ్రైవర్ చేసే చిన్నపాటి నిర్లక్ష్యం కూడా పెద్ద ప్రమాదానికి దారితీసే అవకాశం ఉన్నందున ఎల్లప్పుడూ అప్రమత్తంగా ఉండాలని సూచించారు.మద్యం సేవించి వాహనం నడపకూడదని, డ్రైవింగ్ సమయంలో సెల్‌ఫోన్ ఉపయోగించకూడదని స్పష్టం చేశారు. ప్రయాణికుల భద్రతను దృష్టిలో ఉంచుకుని ట్రాఫిక్ నిబంధనలు, రోడ్డు భద్రతా నియమాలను తప్పనిసరిగా పాటించాలని సూచించారు.
విధులకు హాజరయ్యే ముందు డ్రైవర్లు తగినంత విశ్రాంతి తీసుకోవాలని, ఆరోగ్యాన్ని కాపాడుకోవాలని, అలసటగా ఉన్నప్పుడు డ్రైవింగ్‌కు దూరంగా ఉండాలని అవగాహన కల్పించారు. ఏకాగ్రత కోల్పోకుండా వాహనాన్ని పూర్తి నియంత్రణలో ఉంచుతూ ప్రయాణికులను సురక్షితంగా గమ్యస్థానాలకు చేర్చాలని సూచించారు.శిక్షణలో భాగంగా బీఎస్-6 బస్సుపై ప్రాక్టికల్ శిక్షణ కూడా డ్రైవర్లకు అందించారు. సురక్షిత డ్రైవింగ్‌తో పాటు ఇంధన పొదుపు కోసం పాటించాల్సిన పద్ధతులపై అవగాహన కల్పించారు.
ఈ కార్యక్రమంలో నిజామాబాద్ రీజియన్ మేనేజర్, నిజామాబాద్-1 డిపో మేనేజర్ ఎం. వెంకటరమణ, ఆర్టీసీ డ్రైవర్లు, అవుట్సోర్సింగ్ డ్రైవర్లు, ఇతర విభాగాల సిబ్బంది పాల్గొన్నారు.



