Breaking News

తిరుగుబాటుకే పాఠం నేర్పిన చాకలి ఐలమ్మ: కేసీఆర్

తెలంగాణ సాయుధ రైతాంగ పోరాట యోధురాలు, బహుజన ఆత్మగౌరవ ప్రతీక చిట్యాల (చాకలి) ఐలమ్మ జయంతి సందర్భంగా తెలంగాణ తొలి ముఖ్యమంత్రి, బీఆర్ఎస్ అధినేత కేసీఆర్ ఆమెకు ఘనంగా నివాళులర్పించారు. చాకలి ఐలమ్మ నిరంకుశ రాచరిక పాలనకు, భూస్వాముల అణచివేతకు వ్యతిరేకంగా గళమెత్తిన ధీరవనిత అని, ఆమె ప్రదర్శించిన ప్రజాస్వామిక పోరాట పంథా నేటి తరానికి ఆదర్శనీయమని ఆయన కొనియాడారు. మలిదశ తెలంగాణ రాష్ట్ర సాధన ఉద్యమంలో ఐలమ్మ స్ఫూర్తి ఎంతగానో ఇమిడి ఉందని గుర్తుచేశారు.

తన పదేండ్ల బీఆర్ఎస్ పాలనలో ఐలమ్మ జయంతిని అధికారికంగా నిర్వహించే సాంప్రదాయాన్ని ప్రారంభించడంతో పాటు, మహిళా సంక్షేమం, రైతాంగ హక్కులు, కులవృత్తుల పునరుజ్జీవనం ద్వారా సబ్బండ వర్గాల ఆత్మగౌరవాన్ని కాపాడామని కేసీఆర్ వివరించారు. రైతాంగం, బహుజన వర్గాల సర్వతోముఖాభివృద్ధే చాకలి ఐలమ్మకు మనం అర్పించే నిజమైన నివాళి అని ఆయన స్పష్టం చేశారు.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *