Breaking News

రైతులను వదిలేసి పశువులకు బీమానా? కేటీఆర్

తెలంగాణలోని కాంగ్రెస్ ప్రభుత్వ విధానాలపై బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ ‘ఎక్స్’ (ట్విట్టర్) వేదికగా విరుచుకుపడ్డారు. గత బీఆర్ఎస్ ప్రభుత్వం రైతుల కుటుంబాలకు ఆర్థిక భరోసాగా అందించిన ‘రైతు బీమా’ పథకం ప్రీమియం చెల్లింపులను నిలిపివేసి, శనివారం కరీంనగర్‌లో కొత్తగా పశువుల బీమాను ప్రారంభించడంపై ఆయన తీవ్ర అభ్యంతరం వ్యక్తం చేశారు. “రైతు బీమా రద్దు.. పశువుల బీమా ముద్దు” అంటూ ప్రభుత్వంపై సెటైర్లు వేసిన కేటీఆర్, రేవంత్ రెడ్డి నాయకత్వంలో నడుస్తున్నది ప్రజాపాలన కాదని, తుగ్లక్ పాలన అని దుయ్యబట్టారు.

రైతు మరణిస్తే కుటుంబాలకు ఆపద్బాంధవుగా నిలిచిన రైతు బీమాను ఆగస్టు 14 నుంచి నిలిపివేశారని వచ్చిన పత్రికా కథనాన్ని ఆయన ఆధారంగా చూపించారు. రైతులను విస్మరించి పశువుల బీమా పేరుతో డ్రామాలు ఆడుతున్నారని, ఈ నిర్ణయం ప్రభుత్వ పరిపాలనా లోపానికి అద్దం పడుతోందని కేటీఆర్ మండిపడ్డారు.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *