Breaking News

అర్ధరాత్రి అక్రమ ఇసుక రవాణా…నలుగురు అరెస్ట్!

ఎటువంటి ప్రభుత్వ అనుమతులు లేకుండా అక్రమంగా ఇసుక రవాణా చేస్తున్న లారీని స్వాధీనం చేసుకుని, నలుగురిపై కేసు నమోదు చేసినట్లు ఆసిఫాబాద్ జిల్లా సిర్పూర్ (టి) ఎస్సై డి. సాగర్ వెల్లడించారు. విశ్వసనీయ సమాచారంతో పెద్ద బండ ఎక్స్ రోడ్ వద్ద పోలీసులు వాహన తనిఖీలు చేపట్టగా.. హీరాపూర్ వైపు నుంచి ఆదిలాబాద్ మార్గంలో ఎలాంటి పత్రాలు లేకుండా ఇసుక తరలిస్తున్న లారీ (MH 40 BG 0948)ని పట్టుకున్నారు.

ఈ అక్రమ రవాణా ఘటనలో లారీ డ్రైవర్‌తో పాటు వాహన యజమాని అబ్దుల్ మజీద్ ఖాన్, కాగజ్‌నగర్‌కు చెందిన అసద్, మరియు క్వారీ వద్ద ఇసుక లోడింగ్‌కు సహకరించిన సతీష్‌లపై కేసు నమోదు చేసి దర్యాప్తు జరుపుతున్నారు. అనుమతులు లేకుండా ఒక జిల్లా నుంచి మరొక జిల్లాకు లారీల్లో ఇసుక తరలిపోతుండటం వెనుక కొందరు బడా నాయకులు లేదా అధికారుల హస్తం ఉండి ఉంటుందని స్థానికంగా అనుమానాలు వ్యక్తమవుతున్నాయి.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *