Breaking News

ఖైరతాబాద్ బైపోల్ లో కవిత ఎంట్రీ..

ఖైరతాబాద్ ఉపఎన్నిక వేళ తెలంగాణ రక్షణ సేన చీఫ్ కల్వకుంట్ల కవిత కీలక ప్రకటన చేశారు. ఖైరతాబాద్ ఉపఎన్నికల్లో తమ ‘తెలంగాణ రక్షణ సేన’ పార్టీ పోటీ చేస్తుందని స్పష్టం చేశారు. శనివారం బంజారాహిల్స్‌లోని పార్టీ కార్యాలయంలో ఏర్పాటు చేసిన విలేకరుల సమావేశంలో మాట్లాడిన ఆమె, ప్రభుత్వంపై తీవ్ర విమర్శలు గుప్పించారు. పాలనా వైఫల్యాలను కప్పిపుచ్చుకునేందుకే ఫామ్‌హౌస్ డ్రామాలు ఆడుతున్నారని, కేవలం మాటల ప్రభుత్వంగా మారి చేతల్లో శూన్యమని విమర్శించారు.

ప్రభుత్వ ఆసుపత్రుల్లో తీవ్ర నిర్లక్ష్యం: సమాచార హక్కు చట్టం (RTI) ద్వారా లభించిన గణాంకాలను బయటపెడుతూ, రాష్ట్రంలో చిన్నారుల మరణాలు ఆందోళనకరంగా పెరిగాయని కవిత ఆరోపించారు. విశ్వనగరం అని చెప్పుకునే హైదరాబాద్ పరిధిలోని ప్రభుత్వ ఆసుపత్రిలోనే గతేడాది 1,046 మంది చిన్నారులు మరణించారని ఆవేదన వ్యక్తం చేశారు. కాంగ్రెస్ ప్రభుత్వం బడ్జెట్‌లో వైద్య రంగానికి కేవలం 5 శాతం నిధులే కేటాయించిందని మండిపడ్డారు.

ప్రభుత్వాసుపత్రులు, పాఠశాలల్లో కనీస సౌకర్యాలు, పరిశుభ్రత లేకపోతే ఫోటోలు, వీడియోలు తీసి టీఆర్ఎస్ (TRS) సోషల్ మీడియాకు ట్యాగ్ చేయాలని యువతకు, కార్యకర్తలకు పిలుపునిచ్చారు. పాఠశాలల్లో మరుగుదొడ్లు లేకపోతే అవసరమైతే తమ పార్టీ నిధులతోనే నిర్మిస్తామని ఆమె పేర్కొన్నారు.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *