Breaking News

కొండా లక్ష్మణ్ బాపూజీ సేవలు స్ఫూర్తిదాయకం

నిజామాబాద్ ఆర్టీసీ రీజియన్ కార్యాలయంలో ఘనంగా జయంతి వేడుకలు

నిజామాబాద్, సెప్టెంబర్ 27: (E6tv NEWS: ప్రతినిధి).

స్వతంత్ర సమరయోధుడు, తెలంగాణ ఉద్యమ నేత కొండా లక్ష్మణ్ బాపూజీ జయంతి వేడుకలను టీజీఎస్‌ఆర్టీసీ నిజామాబాద్ రీజియన్ కార్యాలయంలో ఘనంగా నిర్వహించారు.రీజినల్ మేనేజర్ ఎస్.వి.జి. కృష్ణమూర్తి ఆధ్వర్యంలో కొండా లక్ష్మణ్ బాపూజీ చిత్రపటానికి పూలమాల వేసి నివాళులర్పించారు. అనంతరం పుష్పాంజలి ఘటించి, దేశ స్వాతంత్ర్య పోరాటంలో ఆయన చేసిన సేవలను, తెలంగాణ ప్రజల హక్కుల కోసం సాగించిన పోరాటాన్ని స్మరించుకున్నారు.

ఈ సందర్భంగా ఆర్టీసీ అధికారులు మాట్లాడుతూ.. కొండా లక్ష్మణ్ బాపూజీ ఆశయాలు, ప్రజాసేవ పట్ల ఆయన చూపిన నిబద్ధత ప్రతి ఒక్కరికీ స్ఫూర్తిదాయకమని అన్నారు. ఆయన ఆశయాలను స్ఫూర్తిగా తీసుకుని ప్రజాసేవలో ముందుకు సాగాలని, సమాజ అభివృద్ధికి ప్రతి ఒక్కరూ తమ వంతు కృషి చేయాలని పిలుపునిచ్చారు.కార్యక్రమంలో నిజామాబాద్-1 డిపో మేనేజర్, సూపరింటెండెంట్, రీజియన్ కార్యాలయ సిబ్బంది, విజిలెన్స్ సిబ్బంది, తదితరులు పాల్గొని కొండా లక్ష్మణ్ బాపూజీకి ఘనంగా నివాళులర్పించారు.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *