రైతు సమస్యల పరిష్కారం కోసం బీజేపీ నేతల బైక్ ర్యాలీ
బోధన్, సెప్టెంబర్ 28: (E6tv NEWS: ప్రతినిధి).
రైతుల సమస్యల పరిష్కారం కోసం ఇందూర్ జిల్లా కిసాన్ మోర్చా ఆధ్వర్యంలో చేపట్టిన సైకిల్ ర్యాలీకి సంఘీభావంగా బాన్సువాడ నియోజకవర్గ బీజేపీ నాయకులు బైక్ ర్యాలీ నిర్వహించారు. బాన్సువాడ నియోజకవర్గ బీజేపీ నాయకులు, ఎన్నారై కోనేరు శశాంక్ ఆధ్వర్యంలో రుద్రూర్ నుంచి బోధన్ వరకు సుమారు 240 బైక్‌లతో భారీ ర్యాలీ చేపట్టారు.
బోధన్ పట్టణంలోని అంబేద్కర్ చౌరస్తా వద్ద నిర్వహించిన కార్నర్ మీటింగ్‌లో నిజామాబాద్ ఎంపీ ధర్మపురి అర్వింద్‌తో కలిసి కోనేరు శశాంక్ పాల్గొన్నారు. రైతాంగ సమస్యలను పరిష్కరించాలని డిమాండ్ చేస్తూ కిసాన్ మోర్చా ఆధ్వర్యంలో నిర్వహిస్తున్న సైకిల్ ర్యాలీకి తమ మద్దతు ప్రకటించారు.ఈ సందర్భంగా బాన్సువాడ నియోజకవర్గానికి చెందిన బీజేపీ నాయకులు, కార్యకర్తలు భారీ సంఖ్యలో బైక్‌లతో ర్యాలీగా బోధన్‌కు చేరుకున్నారు. రైతుల సమస్యల పరిష్కారం కోసం బీజేపీ నిరంతరం పోరాటం చేస్తుందని నాయకులు పేర్కొన్నారు.
కార్యక్రమంలో నిజామాబాద్ అర్బన్ ఎమ్మెల్యే ధన్‌పాల్ సూర్యనారాయణ గుప్తా, పసుపు బోర్డు చైర్మన్ పల్లె గంగారెడ్డి, నిజామాబాద్ జిల్లా బీజేపీ అధ్యక్షుడు దినేష్ కులాచారి, కిసాన్ మోర్చా అధ్యక్షుడు తిరుపతి రెడ్డి, సీనియర్ నాయకులు, రైతులు, బీజేపీ కార్యకర్తలు పాల్గొన్నారు.

