భీంగల్, సెప్టెంబరు 28:(E6tv NEWS: ప్రతినిధి)
అనుమతి లేకుండా అక్రమంగా ఇసుకను రవాణా చేస్తున్న ట్రాక్టర్‌ను భీంగల్ పోలీసులు గుర్తించి స్వాధీనం చేసుకున్నారు. ట్రాక్టర్ డ్రైవర్‌పై కేసు నమోదు చేసి దర్యాప్తు చేపట్టారు.పోలీసుల వివరాల ప్రకారం.. సోమవారం ఉదయం సుమారు 7.30 గంటల సమయంలో భీంగల్ పోలీస్ స్టేషన్ పరిధిలోని బెజ్జొరా బైపాస్ రోడ్డుపై ఇసుకతో అనుమానాస్పదంగా వెళ్తున్న జాన్ డీర్ ట్రాక్టర్‌ను పోలీసులు గుర్తించారు. ట్రాక్టర్ నంబర్ AP15BP1423గా గుర్తించారు.
ట్రాక్టర్ డ్రైవర్‌ను విచారించగా భీంగల్ మండలం రాజారం నగర్ కాలనీకి చెందిన సూర రాకేష్ (30)గా గుర్తించినట్లు పోలీసులు తెలిపారు. ఇసుక రవాణాకు సంబంధించి అనుమతి పత్రాలు లేకపోవడంతో ట్రాక్టర్‌ను, డ్రైవర్‌ను పోలీస్ స్టేషన్‌కు తరలించారు.అనుమతి లేకుండా ఇసుకను రవాణా చేసినందుకు డ్రైవర్‌పై కేసు నమోదు చేసి దర్యాప్తు చేపట్టినట్లు భీంగల్ ఎస్‌ఐ సీహెచ్ తిరుపతి తెలిపారు.
