Breaking News

కేజీబీవీ విద్యార్థులకు 35 డబుల్ డెస్క్ బెంచీల పంపిణీ

భీంగల్, సెప్టెంబర్ 29:(E6tv NEWS: ప్రతినిధి)

విద్యార్థుల సౌకర్యార్థం భీంగల్ కస్తూర్బా గాంధీ బాలికల విద్యాలయం (కేజీబీవీ)కు 35 డబుల్ డెస్క్ బెంచీలను పంపిణీ చేశారు. మాజీ మంత్రి, ఎమ్మెల్యే వేముల ప్రశాంత్ రెడ్డి కృషితో పారిశ్రామికవేత్త దయానంద్ రెడ్డి ఈ బెంచీలను అందజేశారు.

విద్యార్థులకు మెరుగైన విద్యా వసతులు కల్పించాలనే ఉద్దేశంతో డబుల్ డెస్క్ బెంచీలను అందించడం పట్ల పాఠశాల నిర్వాహకులు, విద్యార్థులు హర్షం వ్యక్తం చేశారు. విద్యార్థుల అవసరాలను గుర్తించి వసతుల కల్పనకు సహకరించిన దయానంద్ రెడ్డికి వారు కృతజ్ఞతలు తెలిపారు.ఈ కార్యక్రమంలో టీఆర్ఎస్ నాయకులు బోదిరే నర్సయ్య, శర్మ నాయక్, సతీష్, ముత్తన్న, మల్లెల ప్రసాద్, మూత లింబాద్రి, రతన్ రాజ్, సాగర్, అశోక్, అరుణ్, సురేష్, గంగాధర్, శంకర్, గోపి, చింటూతో పాటు కేజీబీవీ ప్రిన్సిపాల్ అనురాధ తదితరులు పాల్గొన్నారు.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *