Breaking News

బదిరులకు అండగా ఉంటా: అర్బన్ ఎమ్మెల్యే ధన్‌పాల్

ఇందూరు, సెప్టెంబర్ 29:(E6tv NEWS: ప్రతినిధి)

జిల్లాలోని బదిరులకు తాను ఎల్లప్పుడూ అండగా ఉంటానని అర్బన్ ఎమ్మెల్యే ధన్‌పాల్ సూర్యనారాయణ గుప్తా తెలిపారు. డెఫ్ ఎంప్లాయీస్ అసోసియేషన్ ఆధ్వర్యంలో మంగళవారం నగరంలోని న్యూ అంబేద్కర్ భవన్‌లో అంతర్జాతీయ సంకేత భాషా దినోత్సవాన్ని నిర్వహించారు.

ఈ సందర్భంగా ఎమ్మెల్యే ధన్‌పాల్ మాట్లాడుతూ బదిరుల్లో ఎంతో మేధాశక్తి, ప్రతిభ దాగి ఉంటుందని అన్నారు. సాధారణ వ్యక్తులతో సమానంగా పోటీ ప్రపంచంలో ముందుకు సాగుతున్న బదిరులను అభినందించారు. బదిరులుగా ఉంటూనే ప్రభుత్వ ఉద్యోగాల్లో స్థిరపడటం అభినందనీయమన్నారు.శారీరక లోపాలను పట్టించుకోకుండా ఆత్మవిశ్వాసంతో ముందుకు సాగాలని, తమ పనిని తాము సమర్థవంతంగా చేసుకుంటూ కృషి చేస్తే విజయం తప్పకుండా సాధ్యమవుతుందని ఎమ్మెల్యే పేర్కొన్నారు. జిల్లాలోని బదిరుల సమస్యల పరిష్కారానికి, వారి సంక్షేమానికి తన వంతు సహకారం ఎల్లప్పుడూ అందిస్తానని హామీ ఇచ్చారు.

ఈ కార్యక్రమంలో డెఫ్ ఎంప్లాయీస్ అసోసియేషన్ అధ్యక్షుడు ఉదయ్ కుమార్, ప్రధాన కార్యదర్శి మహేష్, 19వ డివిజన్ కార్పొరేటర్ నాగోల్ల లక్ష్మీనారాయణ, జ్యోతి మురళి తదితరులు పాల్గొన్నారు.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *