Breaking News

యువ ఓటర్లపై ఈసీ దృష్టి…SIR పూర్తయిన రాష్ట్రాల్లో ఈసీ స్పెషల్ డ్రైవ్

దేశవ్యాప్తంగా ప్రత్యేక సమగ్ర ఓటర్ల జాబితా సవరణ (SIR) పూర్తయిన రాష్ట్రాలు మరియు కేంద్ర పాలిత ప్రాంతాల్లో కొత్త ఓటర్ల నమోదు కోసం ప్రత్యేక డ్రైవ్ చేపట్టాలని కేంద్ర ఎన్నికల సంఘం (ECI) ఆదేశించింది. ముఖ్యంగా ఓటర్ల జాబితాలో చోటు దక్కని వారు, తొలిసారి ఓటు హక్కు పొందే యువతను గుర్తించి నమోదు చేయడమే లక్ష్యంగా ఈ డ్రైవ్ నిర్వహించనున్నారు.

ఎస్ఐఆర్ (SIR) కంటే ముందు ఉన్న పాత జాబితాను ప్రస్తుత జాబితాతో పోల్చి చూసి, పేర్లు గల్లంతైన అర్హులైన ఓటర్లను గుర్తించనున్నారు. బీఎల్‌ఓలు (BLO) ఇళ్ల వద్దకే వచ్చి ఫారమ్-6 ద్వారా దరఖాస్తులు సేకరించడంతో పాటు, దరఖాస్తులను సులభతరం చేసేందుకు ‘బూత్ లెవెల్ క్యాంపులు’ కూడా ఏర్పాటు చేయాలని ఎన్నికల సంఘం తెలిపింది. ప్రతి వారం 20-25 ఇళ్లను సందర్శిస్తూ నెలాఖరు నాటికి ఈ ప్రక్రియను పూర్తి చేయాలని ఈసీ ఆదేశించింది.

ప్రత్యేక పరిశోధనాత్మక సవరణ (SIR) ప్రక్రియ పూర్తయిన రాష్ట్రాలు మరియు కేంద్రపాలిత ప్రాంతాల్లో గల్లంతైన అర్హులైన ఓటర్లతో పాటు, కొత్త మరియు యువ ఓటర్లను తక్షణమే ఓటర్ల జాబితాలో చేర్చేందుకు ప్రత్యేక డ్రైవ్ చేపట్టాలని కేంద్ర ఎన్నికల సంఘం (ఈసీ) ఆదేశించింది.

SIR ప్రక్రియలో కోట్ల మంది అర్హులైన పౌరుల పేర్లు గల్లంతయ్యాయని ప్రతిపక్షాలు ఆరోపిస్తున్న నేపథ్యంలో ఈసీ ఈ నిర్ణయం తీసుకుంది. ఈ డ్రైవ్ ముఖ్య వివరాలు:

  • ఇంటింటికీ బీఎల్‌ఓలు: ఓటర్ల జాబితా ఆధారంగా బూత్ స్థాయి అధికారులు (BLOలు) SIR పూర్వపు మరియు ప్రస్తుత జాబితాలను పోల్చి చూస్తారు. పేర్లు తొలగించబడిన అర్హులను గుర్తించి, నేరుగా వారి ఇళ్లకు వెళ్లి దరఖాస్తులు స్వీకరిస్తారు.
  • లక్ష్యం: ప్రతి బీఎల్‌ఓ వారానికి 20 నుండి 25 మంది గల్లంతైన ఓటర్లను కవర్ చేస్తూ, ఒక నెల వ్యవధిలో ఈ పరిశీలన ప్రక్రియను పూర్తి చేయాల్సి ఉంటుంది.
  • ఫారమ్-6 స్వీకరణ: కొత్తగా అర్హత సాధించిన యువత మరియు గల్లంతైన ఓటర్ల నుంచి బీఎల్‌ఓలు అక్కడికక్కడే ఫారమ్-6 ద్వారా దరఖాస్తులను సేకరిస్తారు.
  • పారదర్శకత: ప్రక్రియలో పారదర్శకతను కాపాడేందుకు సేకరించిన వివరాలను గుర్తింపు పొందిన రాజకీయ పార్టీల బూత్ స్థాయి ఏజెంట్లతో (BLA) పంచుకోనున్నారు.

ఓటరు నమోదు అనేది నిరంతర ప్రక్రియ అని, SIR Enumeration సమయములో నమోదు కానంత మాత్రాన అర్హత కలిగిన ఏ ఒక్క పౌరుడూ ఓటు హక్కును కోల్పోకూడదని ఎన్నికల సంఘం స్పష్టం చేసింది.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *