Breaking News

గాంధీజీకి జిల్లా ఎస్పీ ఘన నివాళులు

నిర్మల్, అక్టోబర్ 2:(E6tv NEWS: ప్రతినిధి)

జాతిపిత మహాత్మా గాంధీ జయంతి సందర్భంగా నిర్మల్ జిల్లా ఎస్పీ క్యాంప్ కార్యాలయంలో గాంధీజీ చిత్రపటానికి జిల్లా ఎస్పీ డా. జి. జానకి షర్మిల, IPS పూలమాల వేసి ఘనంగా నివాళులర్పించారు.

ఈ సందర్భంగా ఎస్పీ మాట్లాడుతూ.. దేశానికి మహాత్మా గాంధీ అందించిన సేవలు చిరస్మరణీయమని అన్నారు. గాంధీజీ బోధించిన సత్యం, అహింస, శాంతి, సహనం, ధర్మం వంటి విలువలు నేటి సమాజానికి కూడా ఆదర్శప్రాయమని పేర్కొన్నారు. అహింసా మార్గంలో స్వాతంత్య్ర ఉద్యమానికి నాయకత్వం వహించి ప్రజల్లో ఐక్యత, దేశభక్తి స్ఫూర్తిని గాంధీజీ నింపారని తెలిపారు.గాంధీజీ ఆశయాలను ప్రతి ఒక్కరూ ఆచరణలో పెట్టాలని, సమాజంలో శాంతి, సామరస్యం, సౌభ్రాతృత్వం, ఐక్యత పెంపొందించేందుకు కృషి చేయాలని ఎస్పీ సూచించారు. యువత గాంధీజీ జీవితాన్ని ఆదర్శంగా తీసుకుని నిజాయితీ, క్రమశిక్షణ, సేవాభావంతో ముందుకు సాగాలని పిలుపునిచ్చారు.

ప్రజలకు సేవ చేయడం, వారి భద్రతకు భరోసా కల్పించడం పోలీస్ శాఖ ప్రధాన బాధ్యత అని పేర్కొంటూ.. ప్రజలతో స్నేహపూర్వకంగా వ్యవహరిస్తూ విధులను అంకితభావంతో నిర్వహించాలని పోలీస్ అధికారులు, సిబ్బందికి సూచించారు.అనంతరం పోలీస్ అధికారులు, సిబ్బంది గాంధీజీ చిత్రపటానికి పుష్పాంజలి ఘటించి నివాళులర్పించారు. కార్యక్రమంలో ఆర్‌ఐలు రామ్ నిరంజన్, రామకృష్ణ, ఆర్‌ఎస్‌ఐలు, పోలీస్ అధికారులు, సిబ్బంది పాల్గొన్నారు.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *