Breaking News

బీడీ కార్మికులకు నెలకు రూ.4 వేల చేయూత పెన్షన్ ఇవ్వాలి

అక్టోబర్ 6న ‘ఛలో భైంసా’ కార్యక్రమాన్ని విజయవంతం చేయాలి
తెలంగాణ ప్రగతిశీల బీడీ వర్కర్స్ యూనియన్ జిల్లా కార్యదర్శి కే. రాజన్న

ముధోల్, అక్టోబర్ 3: (E6tv NEWS: ప్రతినిధి)

బీడీ కార్మికులు, ప్యాకర్లు, షేకర్లు, టేకేదార్లకు ప్రభుత్వం నెలకు రూ.4 వేల చేయూత పెన్షన్ మంజూరు చేయాలని తెలంగాణ ప్రగతిశీల బీడీ వర్కర్స్ యూనియన్ (TUCI) జిల్లా కార్యదర్శి కే. రాజన్న డిమాండ్ చేశారు. కార్మికుల సమస్యల పరిష్కారం కోసం అక్టోబర్ 6న నిర్వహించనున్న ‘ఛలో భైంసా’ కార్యక్రమాన్ని విజయవంతం చేయాలని కోరుతూ శనివారం ముధోల్‌లోని చార్‌బాయి బీడీ పరిశ్రమలో యూనియన్ ఆధ్వర్యంలో ప్రచార కార్యక్రమం నిర్వహించారు.

ఈ సందర్భంగా రాజన్న మాట్లాడుతూ, 30–40 ఏళ్లుగా బీడీ పరిశ్రమలో శ్రమిస్తున్న కార్మికులకు వృద్ధాప్యంలో సరైన ఆర్థిక భద్రత లేకపోవడం ఆందోళనకరమని అన్నారు. రెక్కలు ముక్కలు చేసుకుని బీడీలు చుడుతున్న కార్మికుల సమస్యలను ప్రభుత్వం పరిష్కరించాలని కోరారు. బీడీ కార్మికులతో పాటు ప్యాకర్లు, షేకర్లు, టేకేదార్లందరికీ నెలకు రూ.4,000 చేయూత పెన్షన్ అందించాలని రాష్ట్ర ప్రభుత్వాన్ని డిమాండ్ చేశారు.కార్మికుల న్యాయమైన డిమాండ్ల సాధన కోసం తమ పోరాటం కొనసాగుతుందని రాజన్న స్పష్టం చేశారు. సమస్యల పరిష్కారం కోసం అక్టోబర్ 6న నిర్వహించే ‘ఛలో భైంసా’ కార్యక్రమానికి బీడీ కార్మికులు పెద్ద సంఖ్యలో తరలివచ్చి విజయవంతం చేయాలని పిలుపునిచ్చారు.

ఈ ప్రచార కార్యక్రమంలో యూనియన్ జిల్లా అధ్యక్షులు ఎం. బక్కన్న, ఉపాధ్యక్షులు ఆర్. రామలక్ష్మణ్, జిల్లా నాయకురాలు వి. గోదావరితో పాటు టేకేదార్లు, ప్యాకర్లు, షేకర్లు, బీడీ కార్మికులు పాల్గొన్నారు.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *