జర్నలిస్టుల సమస్యల పరిష్కారానికి నిరంతరం పోరాటం
బోధన్ డివిజన్ దళిత జర్నలిస్ట్ ఫోరం అధ్యక్షుడు గంధం రాజేష్
బోధన్, అక్టోబర్ 3:(E6tv NEWS: ప్రతినిధి).
దళిత, బహుజన జర్నలిస్టుల సంక్షేమం, సమస్యల పరిష్కారమే లక్ష్యంగా దళిత జర్నలిస్ట్ ఫోరం (డీజేఎఫ్) పనిచేస్తోందని బోధన్ డివిజన్ డీజేఎఫ్ గౌరవ అధ్యక్షులు అశోక్ కుంబ్లే తెలిపారు.
బోధన్ పట్టణంలోని స్థానిక లయన్స్ క్లబ్ కార్యాలయంలో శనివారం డీజేఎఫ్ బోధన్ డివిజన్ ప్రెస్ క్లబ్ ఆధ్వర్యంలో సమావేశం నిర్వహించారు. డీజేఎఫ్ బోధన్ డివిజన్ గౌరవ అధ్యక్షులు అశోక్ కుంబ్లే, అధ్యక్షులు గంధం రాజేష్, కమిటీ సభ్యుల ఆధ్వర్యంలో సమావేశం జరిగింది.
ఈ సందర్భంగా అశోక్ కుంబ్లే మాట్లాడుతూ.. డీజేఎఫ్ గత కొన్ని సంవత్సరాలుగా దళిత, బహుజన జర్నలిస్టుల సమస్యల పరిష్కారం కోసం నిరంతరం కృషి చేస్తోందన్నారు. భవిష్యత్తులోనూ జర్నలిస్టుల సంక్షేమానికి సంబంధించిన సమస్యలపై పోరాటాన్ని కొనసాగిస్తామని తెలిపారు.ముఖ్యంగా జర్నలిస్టులకు ఇళ్ల స్థలాలు, హెల్త్ కార్డులు, ఇతర సంక్షేమ పథకాలు అందేలా ప్రభుత్వంపై ఒత్తిడి తీసుకువస్తామని పేర్కొన్నారు. జర్నలిస్టులు ఎదుర్కొంటున్న సమస్యలను సంబంధిత అధికారుల దృష్టికి తీసుకెళ్లి, వాటి పరిష్కారానికి కృషి చేస్తామని చెప్పారు.
డీజేఎఫ్ బోధన్ డివిజన్ అధ్యక్షులు గంధం రాజేష్ మాట్లాడుతూ జర్నలిస్టుల సంక్షేమం కోసం సంఘటితంగా పనిచేస్తామని తెలిపారు. జర్నలిస్టుల హక్కులు, సంక్షేమం కోసం అవసరమైన కార్యాచరణ చేపడతామన్నారు.ఈ సమావేశంలో డీజేఎఫ్ కమిటీ సభ్యులు, దళిత జర్నలిస్టులు పాల్గొన్నారు.

