భీంగల్, అక్టోబర్ 5:(E6tv NEWS: ప్రతినిధి)
బీజేపీ కిసాన్ మోర్చా జిల్లా అధ్యక్షులు తిరుపతి రెడ్డి ఆధ్వర్యంలో గత ఎనిమిది రోజులుగా కొనసాగుతున్న సైకిల్ యాత్ర సోమవారం భీంగల్‌కు చేరుకుంది. బడా భీంగల్ నుంచి భీంగల్‌కు చేరుకున్న యాత్రకు భీంగల్ వాగు సమీపంలోని ఆలయం వద్ద బీజేపీ నాయకులు, కార్యకర్తలు ఘన స్వాగతం పలికారు.అనంతరం బోదిరే గల్లీ, బడా భీంగల్ రోడ్డు, బస్టాండ్ మీదుగా పురానిపేట్ వరకు సైకిల్ యాత్ర కొనసాగింది. అక్కడ మధ్యాహ్న భోజనం అనంతరం జగర్యాల మీదుగా సాయంత్రం మోర్తాడ్‌కు యాత్ర చేరుకోనుంది.
ఈ కార్యక్రమంలో బీజేపీ స్టేట్ కౌన్సిల్ మెంబర్ యోగేశ్వర్ నర్సయ్య, కిసాన్ మోర్చా పట్టణ అధ్యక్షులు నీలం గంగాధర్, జిల్లా అధ్యక్షులు తిరుపతి రెడ్డి, మండల అధ్యక్షులు అరె రవీందర్, కిసాన్ మోర్చా మండల అధ్యక్షులు తోట నిచ్చమొల్ల నవీన్, గంగాధర్, ప్రేమ్ చంద్, కుపకల్ సర్పంచ్ నర్సింగ్ రావు, గోపు సంజయ్, కార్తీక్ తదితరులు పాల్గొన్నారు.

