Breaking News

సన్నిత్ యాదవ్‌ను పరామర్శించిన కాంగ్రెస్ పార్టీ ఇంచార్జ్ సునీల్

సన్నిత్ యాదవ్‌ను పరామర్శించిన కాంగ్రెస్ పార్టీ ఇంచార్జ్ సునీల్

బాల్కొండ, అక్టోబర్ 5: (E6tv NEWS: ప్రతినిధి)

బాల్కొండ మండల కేంద్రానికి చెందిన కాంగ్రెస్ యువ నాయకుడు సన్నిత్ యాదవ్‌ను బాల్కొండ కాంగ్రెస్ పార్టీ ఇంచార్జ్ సునీల్ అన్న పరామర్శించారు. ఇటీవల సన్నిత్ యాదవ్ ప్రమాదవశాత్తు కన్నుకు గాయం కావడంతో విషయం తెలుసుకున్న సునీల్ బాల్కొండకు వచ్చి ఆయనను పరామర్శించారు.ప్రమాదానికి సంబంధించిన వివరాలను సన్నిత్ యాదవ్‌ను అడిగి తెలుసుకున్న సునీల్, ఆరోగ్యం పట్ల జాగ్రత్తగా ఉండాలని సూచించారు. త్వరగా కోలుకోవాలని ఆకాంక్షించారు.

ఈ కార్యక్రమంలో బాల్కొండ పట్టణ అధ్యక్షులు కుందారపు శ్రీనివాస్, డీసీసీ ఉపాధ్యక్షులు చాట్ల నరేష్, డీసీసీ జిల్లా కార్యదర్శులు మహమ్మద్ యూనూస్, సంజయ్ గౌడ్, మండల ఉపాధ్యక్షులు గడ్డం రవి, మండల కార్యదర్శులు పుల్లాయి నవీన్ కుమార్, మార పురుషోత్తం, పిట్ల దయాకర్, బండి మల్లేష్, బాల్కొండ గ్రామ ఉపసర్పంచ్ గాండ్ల రాజేందర్, మర్కజ్ కమిటీ అధ్యక్షులు మజరొద్దీన్, బాల్కొండ మాజీ ఉపసర్పంచ్ వాహబ్, అన్వార్, ఆరెపల్లి గంగాధర్, లోచారం వినేష్, దొంపాల్ సాయన్న, మెట్టు అశోక్, షేరు, నుజ్జు, ఆరిఫ్, మేకా నాగేష్, మేక సతీష్, గడ్డం సాయి కుమార్ తదితరులు పాల్గొన్నారు.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *