కమ్మర్‌పల్లి, అక్టోబర్ 5:(E6tv NEWS: ప్రతినిధి).
మండలంలోని బషీరాబాద్ గ్రామానికి చెందిన మహిళా సమాఖ్య (VOA) కృష్ణవేణి భర్త శ్రీనివాస్ ఇటీవల అనారోగ్యంతో మృతి చెందారు. ఈ విషయం తెలుసుకున్న బాల్కొండ నియోజకవర్గ కాంగ్రెస్ పార్టీ ఇన్‌చార్జ్ ముత్యాల సునీల్ కుమార్ సోమవారం వారి కుటుంబాన్ని పరామర్శించి, శ్రీనివాస్ మృతికి సంతాపం తెలిపారు. కుటుంబ సభ్యులను ఓదార్చి ధైర్యంగా ఉండాలని సూచించారు.అదే గ్రామానికి చెందిన కట్ట యమున కూడా ఇటీవల అనారోగ్యంతో మృతి చెందారు. ఆమె కుటుంబ సభ్యులను సైతం సునీల్ కుమార్ పరామర్శించి, ప్రగాఢ సానుభూతి తెలిపారు.ఈ కార్యక్రమంలో కాంగ్రెస్ పార్టీ నాయకులు, కార్యకర్తలు పాల్గొన్నారు.



