Breaking News

ఓటర్ల జాబితా సవరణపై సుప్రీంకోర్టు కీలక విచారణ

దేశవ్యాప్తంగా చేపట్టిన స్పెషల్ ఇంటెన్సివ్ రివిజన్ (SIR) ప్రక్రియపై సుప్రీంకోర్టులో ఈరోజు కీలక విచారణ జరగనుంది. ప్రధాన ఎన్నికల కమిషనర్ గ్యానేశ్ కుమార్ పనితీరు, ఇసి నిర్ణయాలను ప్రశ్నిస్తూ దాఖలైన పిటిషన్లతో పాటు, ఎస్‌ఐఆర్ ప్రక్రియను సవాల్ చేస్తూ వచ్చిన దరఖాస్తులపై చీఫ్ జస్టిస్ సూర్యకాంత్ నేతృత్వంలోని ధర్మాసనం విచారణ చేపడుతోంది. ఈ ప్రక్రియ వల్ల భారీ సంఖ్యలో అర్హులైన ఓటర్ల పేర్లు తొలగించబడుతున్నాయన్న ఆరోపణలు దేశవ్యాప్తంగా రాజకీయంగా తీవ్ర చర్చకు దారితీశాయి. హైదరాబాద్‌లో బల్క్ ఫార్మ్-7ల సమర్పణ అంశం హాట్‌టాపిక్‌గా మారగా, ఓటు హక్కును కోల్పోయేలా చేసే ప్రక్రియ రాజ్యాంగ విలువలకు విరుద్ధంగా ఉండకూడదని జస్టిస్ ఉజ్జల్ భుయాన్ ఇటీవల వ్యాఖ్యానించిన సంగతి తెలిసిందే. ఒక్క అర్హుడి పేరు కూడా తొలగించబడకుండా, అనర్హుల పేర్లు చేరకుండా బ్యాలెన్స్ చేయడంపై అత్యున్నత న్యాయస్థానం ఎలాంటి మార్గదర్శకాలు ఇస్తుందోనని సర్వత్రా ఆసక్తి నెలకొంది.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *