Breaking News

రాయలసీమ నిధులపై రోజా ఫైర్..సీఎం చంద్రబాబుపై తీవ్ర విమర్శలు

రాయలసీమలో కరవు, సాగునీటి సమస్యలను పరిష్కరించడంలో రాష్ట్ర ప్రభుత్వం పూర్తిగా విఫలమైందని వైసీపీ నాయకురాలు, మాజీ మంత్రి ఆర్.కే. రోజా తీవ్రస్థాయిలో ధ్వజమెత్తారు. చిత్తూరులో మీడియాతో మాట్లాడుతూ.. “కరవు, చంద్రబాబు కవల పిల్లలు” అని వ్యాఖ్యానించిన ఆమె, రాయలసీమ ప్రాజెక్టుల కోసం రూ.24,000 కోట్లు ఖర్చు చేశామని చెబుతున్న మాటల్లో నిజం లేదని, ఆ నిధులు ఎక్కడ వెచ్చించారో ప్రజలకు చూపించాలని సవాల్ విసిరారు. కూటమి ప్రభుత్వానికి చిత్తశుద్ధి ఉంటే రాయలసీమ లిఫ్ట్ ఇరిగేషన్ ప్రాజెక్టును ప్రకటించాలని, ‘రైజింగ్ రాయలసీమ’ పేరిట నినాదాలతో ప్రజలను తప్పుదోవ పట్టించకుండా కొత్తగా ఎన్ని ఎకరాలకు సాగునీరు ఇచ్చారో స్పష్టమైన లెక్కలు బయటపెట్టాలని ఆమె డిమాండ్ చేశారు.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *