దసరా పండుగ సందర్భంగా హైదరాబాద్ నగరవాసులకు టీజీఎస్ఆర్టీసీ బిగ్ ఆఫర్ ప్రకటించింది. శంషాబాద్ రాజీవ్ గాంధీ అంతర్జాతీయ విమానాశ్రయానికి నడిచే ఏసీ ‘పుష్పక్’ బస్సుల్లో ప్రయాణ ఛార్జీలను ఏకంగా 40 శాతం వరకు తగ్గిస్తున్నట్లు గ్రేటర్ ఆర్టీసీ ఈడీ అంచూరి శ్రీధర్ వెల్లడించారు. ఈ నిర్ణయంతో వివిధ రూట్లలో రూ. 150 వరకు టికెట్ ధరలు తగ్గి బుధవారం నుంచే అమలులోకి రాగా, శిల్పారామం, గచ్చిబౌలి, కొత్తగూడల నుంచి గతంలో ఉన్న రూ.350 ఛార్జీ స్థానంలో రూ.150కి, లింగంపల్లి, జేబీఎస్, జేఎన్టీయూల నుంచి రూ.200కి, మియాపూర్ నుంచి రూ.250కి ప్రయాణించవచ్చని స్పష్టం చేశారు. ప్రైవేట్ క్యాబ్‌ల భారం నుంచి ఎయిర్పోర్ట్ ప్రయాణికులకు ఉపశమనం కలిగించి చౌకైన, మెరుగైన రవాణా సౌకర్యాన్ని అందించేందుకే ఈ ధరల సవరణ చేసినట్లు అధికారులు తెలిపారు.
