జగిత్యాల ప్రభుత్వ మెడికల్ కాలేజీలో కనీస మౌలిక సదుపాయాలు లేకపోవడాన్ని నిరసిస్తూ విద్యార్థులు ఆందోళన బాట పట్టారు. గత నాలుగేళ్లుగా గోదాం తరహా భవనాల్లోనే నాణ్యమైన తరగతి గదులు, ల్యాబ్లు, హాస్టల్, మెస్ సౌకర్యాలు లేకుండా తీవ్ర ఇబ్బందులు పడుతున్నామని, ఎన్ఎమ్సీ నిబంధనల ప్రకారం నూతన భవనాల నిర్మాణాలు తక్షణమే పూర్తి చేయాలని డిమాండ్ చేస్తూ భారీ ర్యాలీ చేపట్టారు. మాతా శిశు ఆసుపత్రి, క్రిటికల్ కేర్ సెంటర్లు కాలేజీకి దూరంగా ఉండటంతో రవాణా సౌకర్యం లేక 600 మంది విద్యార్థులు ఇబ్బంది పడుతున్నారని, ఎమ్మెల్యే మరియు అధికారులకు విన్నవించినా ఫలితం లేకపోయిందని ఆవేదన వ్యక్తం చేస్తూ, ప్రభుత్వం తక్షణమే స్పందించి వసతులు కల్పించాలని నినాదాలు చేశారు.
జగిత్యాల మెడికల్ కాలేజీలో మౌలిక వసతుల కోసం విద్యార్థుల నిరసన
