Breaking News

చింతకుంటలో 20 సీసీ కెమెరాలు ప్రారంభం

ప్రజల భాగస్వామ్యంతో గ్రామ భద్రతకు పటిష్ట చర్యలు
నిర్మల్ జిల్లా ఎస్పీ డా. జి. జానకి షర్మిల, IPS

నిర్మల్ జిల్లా, అక్టోబర్ 07 (E6tv NEWS: ప్రతినిధి)
“గ్రామ భద్రత – మనందరి బాధ్యత” అనే నినాదంతో ముధోల్ మండలం చింతకుంట గ్రామంలో ప్రజల సౌజన్యంతో ఏర్పాటు చేసిన 20 సీసీ కెమెరాలను జిల్లా ఎస్పీ డా. జి. జానకి షర్మిల, IPS బుధవారం ప్రారంభించారు. గ్రామ పంచాయతీ భవనంలో ఏర్పాటు చేసిన సీసీ కెమెరాల ద్వారా గ్రామంలోని ముఖ్య ప్రాంతాలు, ప్రధాన రహదారులు, ప్రవేశ, నిష్క్రమణ మార్గాలపై నిరంతరం నిఘా కొనసాగనుంది.

ఈ సందర్భంగా ఎస్పీ మాట్లాడుతూ “నేరాల రహిత గ్రామం – సీసీ కెమెరాల నిఘాలో మన చింతకుంట” అనే లక్ష్యంతో గ్రామ ప్రజలు స్వచ్ఛందంగా ముందుకు వచ్చి కెమెరాల ఏర్పాటుకు సహకరించడం అభినందనీయమన్నారు. సీసీ కెమెరాల ద్వారా అనుమానాస్పద వ్యక్తులు, వాహనాల కదలికలను గుర్తించడంతో పాటు దొంగతనాలు, ప్రమాదాలు, ఇతర నేర ఘటనల దర్యాప్తులో కీలక ఆధారాలు లభిస్తాయని తెలిపారు.

ప్రజల సహకారంతోనే సమగ్ర భద్రత

“ప్రజల సహకారం – పోలీసుల సమన్వయం – సురక్షిత గ్రామం” అనే లక్ష్యంతో ప్రతి గ్రామంలో ప్రజలు పోలీస్ శాఖకు సహకరించాలని ఎస్పీ కోరారు. చింతకుంట గ్రామ ప్రజలు తమ గ్రామ భద్రత కోసం ముందుకు వచ్చి 20 సీసీ కెమెరాలు ఏర్పాటు చేయడం ఇతర గ్రామాలకు ఆదర్శంగా నిలుస్తుందని అన్నారు.గ్రామ భద్రత అనేది పోలీసుల ఒక్కరి బాధ్యత కాదని, ప్రజలందరి సమిష్టి బాధ్యత అని ఎస్పీ పేర్కొన్నారు. ఇతర గ్రామాల ప్రజలు కూడా సీసీ కెమెరాల ఏర్పాటుకు ముందుకు వచ్చి నేరాల నియంత్రణకు, సురక్షిత గ్రామాల నిర్మాణానికి సహకరించాలని పిలుపునిచ్చారు.

ఈ కార్యక్రమంలో భైంసా ASP సాయి కిరణ్, IPS, CI దీపక్, SI ప్రదీప్, WSI పెర్సిస్, గ్రామ పెద్దలు, VDC సభ్యులు, పోలీస్ సిబ్బంది తదితరులు పాల్గొన్నారు.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *