ప్రముఖ బాలీవుడ్ నటుడు నానా పటేకర్ (75) ఆకస్మిక మరణం పట్ల ఆంధ్రప్రదేశ్ ఉప ముఖ్యమంత్రి, జనసేన అధినేత పవన్ కల్యాణ్ తీవ్ర దిగ్భ్రాంతి వ్యక్తం చేశారు. గోవాలోని తన నివాసంలో తెల్లవారుజామున గుండెపోటుతో నానా పటేకర్ కన్నుమూసిన సంగతి తెలిసిందే.
పవన్ కల్యాణ్ ‘X’ (ట్విట్టర్) వేదికగా స్పందిస్తూ, “నానా పటేకర్ గారు ఎటువంటి పాత్రలోనైనా ఒదిగిపోయే విలక్షణ నటుడు. ‘క్రాంతివీర్’ చిత్రంలో ఆయన నటన మరచిపోలేనిది. పరిందా, ఖామోషీ, తిరంగా, అగ్నిసాక్షి, నటసామ్రాట్, అబ్ తక్ ఛప్పన్ వంటి ఎన్నో అద్భుతమైన చిత్రాలతో ప్రేక్షకులను అలరించారు” అని కొనియాడారు.
నటుడిగానే కాకుండా భారత సైన్యంలోనూ నానా పటేకర్ గౌరవపూర్వక సేవలు అందించారని పవన్ గుర్తుచేసుకున్నారు. ఆయన ఆత్మకు శాంతి చేకూరాలని ప్రార్థిస్తూ, వారి కుటుంబ సభ్యులకు తన ప్రగాఢ సానుభూతిని తెలియజేశారు. ఐదు దశాబ్దాల సుదీర్ఘ నట ప్రస్థానంలో పద్మశ్రీ, మూడు జాతీయ అవార్డులు అందుకున్న నానా పటేకర్ మృతికి ప్రధాని నరేంద్ర మోదీ సహా పలువురు సినీ, రాజకీయ ప్రముఖులు సంతాపం ప్రకటించారు.
