Breaking News

బోధన్‌లో బార్‌ అండ్‌ రెస్టారెంట్‌కు నోటిఫికేషన్

రూ.1 లక్ష దరఖాస్తు రుసుము.. వార్షిక రుసుము రూ.42 లక్షలు

నిజామాబాద్, అక్టోబర్ 8 (E6tv NEWS: శివ ఠాకూర్).

బోధన్ పట్టణంలో ఒక బార్ అండ్ రెస్టారెంట్ ఏర్పాటుకు సంబంధించి ఎక్సైజ్ శాఖ నోటిఫికేషన్ విడుదల చేసింది. ఎక్సైజ్ కమిషనర్ సి. హరికిరణ్, ఐఏఎస్ ఉత్తర్వుల మేరకు ఈ నోటిఫికేషన్ జారీ చేసినట్లు నిజామాబాద్ జిల్లా ఎక్సైజ్ అధికారి కె.జి. నందగోపాల్ తెలిపారు.

ఆసక్తి గల దరఖాస్తుదారులు రూ.1 లక్ష దరఖాస్తు రుసుము చెల్లించి, ఆధార్ కార్డు, పాన్ కార్డు తదితర అవసరమైన పత్రాలను జతచేసి దరఖాస్తు సమర్పించవచ్చని అధికారులు తెలిపారు.బోధన్‌లో ఏర్పాటు చేయనున్న సదరు బార్‌కు వార్షిక రుసుము రూ.42 లక్షలుగా నిర్ణయించినట్లు జిల్లా ఎక్సైజ్ అధికారి వెల్లడించారు. ఈ మొత్తాన్ని నాలుగు విడతల్లో చెల్లించాల్సి ఉంటుందని తెలిపారు.

సెలవు రోజుల్లోనూ దరఖాస్తుల స్వీకరణ

దరఖాస్తుదారుల సౌకర్యం, చివరి రోజు రద్దీని నివారించేందుకు ప్రభుత్వం ప్రత్యేక అవకాశం కల్పించింది. సాధారణంగా ప్రభుత్వ సెలవు దినాలైన అక్టోబర్ 10, 2026 శనివారం (రెండో శనివారం), అక్టోబర్ 11, 2026 ఆదివారం రోజుల్లోనూ దరఖాస్తులు స్వీకరించనున్నారు.

ఈ రెండు రోజుల్లో ఉదయం 10:30 గంటల నుంచి సాయంత్రం 5:00 గంటల వరకు నిజామాబాద్ జిల్లా ఎక్సైజ్ కార్యాలయం, సంబంధిత డిప్యూటీ కమిషనర్ కార్యాలయాల్లో ప్రత్యేక కౌంటర్లు అందుబాటులో ఉంటాయని అధికారులు తెలిపారు.

అక్టోబర్ 12తో గడువు ముగింపు

బార్ దరఖాస్తులు సమర్పించేందుకు అక్టోబర్ 12, 2026 సాయంత్రం 5 గంటల వరకు మాత్రమే తుది గడువు ఉంటుందని ఎక్సైజ్ శాఖ స్పష్టం చేసింది.చివరి రోజు రద్దీని నివారించేందుకు ఆసక్తి గల దరఖాస్తుదారులు అక్టోబర్ 10, 11 తేదీల్లో లభిస్తున్న అదనపు అవకాశాన్ని వినియోగించుకుని దరఖాస్తులు సమర్పించాలని జిల్లా ఎక్సైజ్ అధికారి కె.జి. నందగోపాల్ కోరారు.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *