తెలంగాణ సంస్కృతికి, ఆత్మగౌరవానికి ప్రతీక అయిన బతుకమ్మ పండుగ ఎంగిలిపూల బతుకమ్మతో ఘనంగా ప్రారంభమైంది. ఈ తొమ్మిది రోజుల పాటు సాగే రాష్ట్ర ప్రజల అత్యంత ప్రియమైన పూల పండుగ సందర్భంగా ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డితో పాటు పలువురు ప్రముఖ నాయకులు ప్రజలకు, ముఖ్యంగా తెలంగాణ ఆడబిడ్డలకు హృదయపూర్వక పండుగ శుభాకాంక్షలు తెలిపారు. ఎంగిలిపూల బతుకమ్మ నుండి సద్దుల బతుకమ్మ వరకు మహిళలు ఆటపాటలతో, సాంస్కృతిక కార్యక్రమాలతో ఈ వేడుకలను వైభవంగా జరుపుకోవాలని ముఖ్యమంత్రి ఆకాంక్షించారు. వివిధ రకాల పూలతో ప్రకృతిని, గౌరమ్మ తల్లిని పూజించడం మన దేశంలోనే ఇక్కడి ప్రత్యేక సంప్రదాయమని ఆయన కొనియాడారు.
- Adilabad
- Hyderabad
- Karimnagar
- Khamam
- Mahaboobnagar
- Medak
- Medchal
- Nalgonda
- News
- Nizambad
- Ranga Reddy
- Telangana
- Warangal
ఆడబిడ్డలకు బతుకమ్మ శుభాకాంక్షలు తెలిపిన సీఎం,నేతలు
