Breaking News

నేతాజీ నగర్‌లో అండర్‌గ్రౌండ్ డ్రైనేజీ సమస్యకు పరిష్కారం

జలమండలి అధికారుల దృష్టికి సమస్య.. చొరవ చూపిన కాలనీ అధ్యక్షుడు బేరి రామచందర్ యాదవ్

గచ్చిబౌలి, అక్టోబర్ 30:(E6tv NEWS).

శేరిలింగంపల్లి నియోజకవర్గంలోని గచ్చిబౌలి డివిజన్ నల్లగండ్ల నేతాజీ నగర్ కాలనీలో నెలకొన్న అండర్‌గ్రౌండ్ డ్రైనేజీ సమస్యకు పరిష్కారం లభించింది. డ్రైనేజీ నుంచి మురుగునీరు ఇళ్లలోకి చేరుతుండటంతో కాలనీవాసులు తీవ్ర ఇబ్బందులు ఎదుర్కొంటున్నారు.

ఈ సమస్యను గుర్తించిన కాలనీ అధ్యక్షుడు బేరి రామచందర్ యాదవ్ వెంటనే జలమండలి అధికారుల దృష్టికి తీసుకెళ్లారు. సూపర్వైజర్ సురేష్‌కు సమాచారం అందించడంతో స్పందించిన అధికారులు సిబ్బందిని కాలనీకి పంపించారు. కాలనీ అధ్యక్షుడు దగ్గరుండి సమస్య పరిష్కారానికి చర్యలు చేపట్టడంతో సిబ్బంది అండర్‌గ్రౌండ్ డ్రైనేజీలో ఏర్పడిన సమస్యను సరిచేశారు.దీంతో కాలనీవాసులకు మురుగునీటి సమస్య నుంచి ఉపశమనం లభించింది. ప్రజలు ఎదుర్కొంటున్న సమస్యలను అధికారుల దృష్టికి తీసుకెళ్లి పరిష్కరించడంలో చొరవ చూపిన కాలనీ అధ్యక్షుడు బేరి రామచందర్ యాదవ్‌ను స్థానికులు అభినందించారు.

ఈ కార్యక్రమంలో అసోసియేషన్ సభ్యులు శంకర్ నాయక్, దశరథ్ నాయక్, గణేష్ నాయక్, రాంబాబు నాయక్ తదితరులు పాల్గొన్నారు.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *