అమ్మవారిని దర్శించుకుని ప్రత్యేక పూజలు నిర్వహించిన బీఆర్ఎస్ పటాన్చెరు నియోజకవర్గ ఇన్ఛార్జ్ ఆదర్శ్ రెడ్డి
పటాన్చెరు, అక్టోబర్ 30 (E6 TV న్యూస్).
సంగారెడ్డి జిల్లా పటాన్చెరు నియోజకవర్గం గుమ్మడిదల మండలం కొత్తపల్లి గ్రామంలో శ్రీశ్రీశ్రీ పోచమ్మ తల్లి విగ్రహ ప్రతిష్ఠాపన, ప్రాణప్రతిష్ఠ, మహా పూర్ణాహుతి కార్యక్రమాలు భక్తిశ్రద్ధలతో, అత్యంత వైభవంగా నిర్వహించారు.
ఈ పవిత్ర కార్యక్రమానికి బీఆర్ఎస్ పటాన్చెరు నియోజకవర్గ ఇన్ఛార్జ్ ఆదర్శ్ రెడ్డి ముఖ్య అతిథిగా హాజరయ్యారు. గుమ్మడిదల మండల బీఆర్ఎస్ అధ్యక్షుడు కొత్తపల్లి ప్రభాకర్ రెడ్డి ప్రత్యేక ఆహ్వానం మేరకు కార్యక్రమంలో పాల్గొన్న ఆయన అమ్మవారిని దర్శించుకుని ప్రత్యేక పూజలు నిర్వహించారు. అనంతరం తీర్థప్రసాదాలు స్వీకరించారు. అలాగే బీఆర్ఎస్ సీనియర్ నాయకులు గోవర్ధన్ రెడ్డి, గుమ్మడిదల మున్సిపల్ చైర్మన్ కుమార్ గౌడ్, జిన్నారం మాజీ జడ్పీటీసీ బాల్ రెడ్డి, రామచంద్రాపురం మాజీ కార్పొరేటర్ తొంట అంజయ్య, బీఆర్ఎస్ సీనియర్ నాయకులు జగన్నాథ్ రెడ్డి తదితరులు పాల్గొన్నారు. గ్రామ సర్పంచ్ మంజుల సత్యయ్య, కౌన్సిలర్లు కుమార్ గౌడ్, మురళీకిషన్, జైపాల్ రెడ్డి, అనంతారం సర్పంచ్ కొమ్ము శ్రీనివాస్, ఆలయ కమిటీ సభ్యులు, గ్రామ పెద్దలు, భక్తులు, పరిసర ప్రాంతాల ప్రజలు పెద్ద సంఖ్యలో హాజరయ్యారు.
అమ్మవారి విగ్రహ ప్రతిష్ఠాపన మహోత్సవం సందర్భంగా గ్రామంలో ఆధ్యాత్మిక సందడి నెలకొనగా, భక్తులు ప్రత్యేక పూజల్లో పాల్గొని అమ్మవారి ఆశీస్సులు పొందారు.

