Breaking News

దసరా ప్రత్యేక బస్సుల నిర్వహణతో రూ.1.97 కోట్ల ఆదాయం

1.15 లక్షల మందికి పైగా ప్రయాణికులకు సురక్షిత ప్రయాణం.. నిజామాబాద్ రీజియన్‌లో 796 బస్సుల నిర్వహణ

నిజామాబాద్, అక్టోబర్ 30 (E6 TV న్యూస్):

దసరా పండుగ సందర్భంగా ప్రయాణికుల రద్దీని దృష్టిలో ఉంచుకుని టీ.జీ.ఎస్. ఆర్టీసీ నిజామాబాద్ రీజియన్ ఆధ్వర్యంలో నిర్వహించిన ప్రత్యేక బస్సు సర్వీసులు మంచి ఆదాయాన్ని సమకూర్చాయి. అక్టోబర్ 9 నుంచి 26వ తేదీ వరకు నిర్వహించిన ప్రత్యేక బస్సుల ఆపరేషన్ ద్వారా సంస్థకు రూ.1.97 కోట్లకు పైగా ఆదాయం లభించింది.

ఈ ప్రత్యేక ఆపరేషన్‌లో నిజామాబాద్ రీజియన్ పరిధిలోని ఆర్మూర్, బాన్సువాడ, బోధన్, కామారెడ్డి, నిజామాబాద్-1, నిజామాబాద్-2 డిపోల ద్వారా మొత్తం 796 బస్సులను నడిపించారు. ఈ బస్సుల ద్వారా 1,15,676 మంది ప్రయాణికులను వారి గమ్యస్థానాలకు సురక్షితంగా చేర్చారు. తద్వారా మొత్తం రూ.1,97,99,000 ఆదాయం సమకూరినట్లు ఆర్టీసీ అధికారులు వెల్లడించారు.దసరా ప్రత్యేక బస్సుల నిర్వహణ విజయవంతం కావడానికి కృషి చేసిన డిపో మేనేజర్లు, అధికారులు, డ్రైవర్లు, కండక్టర్లు, ఇతర సిబ్బందిని టీ.జీ.ఎస్. ఆర్టీసీ నిజామాబాద్ రీజినల్ మేనేజర్ ఎస్.వి.జి. కృష్ణమూర్తి అభినందించారు.భవిష్యత్తులో కూడా ప్రయాణికులకు మెరుగైన, సురక్షితమైన రవాణా సేవలు అందించేందుకు అధికారులు, సిబ్బంది సమన్వయంతో పనిచేయాలని ఆయన సూచించారు.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *