Breaking News

కరవు నివారణపై సీఎం రేవంత్ దృష్టి

హైదరాబాద్ (e6tv news): తెలంగాణలో నెలకొన్న తీవ్ర కరవు పరిస్థితులు, సహాయక చర్యలపై చర్చించేందుకు ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి ఈ నెల 12న ఉన్నతస్థాయి సమీక్ష సమావేశం నిర్వహించనున్నారు. ఎల్ నినో ప్రభావంతో రాష్ట్రంలో సాధారణం కంటే 17 శాతం తక్కువ వర్షపాతం నమోదవగా.. ప్రాథమిక అంచనాల ప్రకారం రాష్ట్రంలోని 18 జిల్లాల్లోని 320 మండలాల్లో తీవ్ర కరవు ఛాయలు అలుముకున్నాయి. ఈ నేపథ్యంలో వ్యవసాయం, సాగు-తాగునీటి సమస్యలు, విద్యుత్ డిమాండ్ వంటి కీలక అంశాలపై సీఎం మంత్రులతో చర్చించనున్నారు. ఇప్పటికే రాష్ట్రాన్ని కరవు పీడిత ప్రాంతంగా ప్రకటించి, కేంద్రం నుంచి రూ.20,000 కోట్ల ప్రత్యేక ప్యాకేజీ కోరిన నేపథ్యంలో.. అక్టోబర్ చివరి నాటికి సమగ్ర కరవు నివేదిక సిద్ధం చేయడంపై అధికారులకు దిశానిర్దేశం చేయనున్నారు.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *