రాష్ట్రపతి ద్రౌపది ముర్మును కలిసిన విపక్ష నేతలు
న్యూఢిల్లీ, అక్టోబర్ 10: (E6tv NEWS).
ఎన్నికల సంఘంలో అక్రమాలు జరిగాయంటూ ఆరోపిస్తూ ఇండియా కూటమి అగ్రనేతలు రాష్ట్రపతి ద్రౌపది ముర్మును కలిశారు. ఈ మేరకు ఎన్నికల సంఘంపై తమ అభ్యంతరాలను వివరిస్తూ రాష్ట్రపతికి వినతిపత్రం సమర్పించారు.
ఈ కార్యక్రమంలో కాంగ్రెస్ జాతీయ అధ్యక్షుడు మల్లికార్జున ఖర్గే, లోక్‌సభలో ప్రతిపక్ష నేత రాహుల్ గాంధీ, తృణమూల్ కాంగ్రెస్ అధినేత్రి మమతా బెనర్జీ, ఎన్సీపీ (శరద్‌చంద్ర పవార్) ఎంపీ సుప్రియా సూలే తదితర ఇండియా కూటమి నేతలు పాల్గొన్నారు.
ఎన్నికల ప్రక్రియలో అక్రమాలు చోటుచేసుకున్నాయన్న ఆరోపణలపై తమ ఆందోళనలను రాష్ట్రపతి దృష్టికి తీసుకెళ్లినట్లు సమాచారం. ఎన్నికల సంఘం పనితీరు, ఎన్నికల నిర్వహణకు సంబంధించిన అంశాలపై విపక్ష నేతలు తమ అభిప్రాయాలను వినతిపత్రంలో ప్రస్తావించారు.ఎన్నికల సంఘంపై విపక్ష కూటమి చేసిన ఆరోపణలు, రాష్ట్రపతికి సమర్పించిన వినతిపత్రంలోని అంశాలు రాజకీయంగా ప్రాధాన్యం సంతరించుకున్నాయి. ఈ పరిణామాలపై అధికార వర్గాల స్పందన, తదుపరి పరిణామాలు ఎలా ఉంటాయన్నది ఆసక్తికరంగా మారింది.
