బాధితులు త్వరగా కోలుకోవాలని ఆకాంక్షించిన ఎమ్మెల్యే వేముల ప్రశాంత్ రెడ్డి
బాల్కొండ, అక్టోబర్ 10 (E6TV న్యూస్: ప్రతినిధి)
నిజామాబాద్ జిల్లా బాల్కొండ నియోజకవర్గానికి చెందిన ఇద్దరు అనారోగ్య బాధితులకు మెరుగైన వైద్యం అందించేందుకు మాజీ మంత్రి, బాల్కొండ ఎమ్మెల్యే వేముల ప్రశాంత్ రెడ్డి రూ.2.20 లక్షల విలువైన ముఖ్యమంత్రి సహాయ నిధి (LOC) లెటర్లను బాధితుల కుటుంబ సభ్యులకు అందజేశారు.
బాల్కొండ మండలం బోడేపల్లి గ్రామానికి చెందిన అనికేష్ బాలయ్య వివిధ అనారోగ్య సమస్యలతో బాధపడుతూ హైదరాబాద్‌లోని నిమ్స్ ఆసుపత్రిలో చికిత్స పొందుతున్నారు. ఆయన వైద్య ఖర్చుల నిమిత్తం రూ.1.10 లక్షల విలువైన ఎల్‌ఓసీని హైదరాబాద్‌లోని తన నివాసంలో కుటుంబ సభ్యులకు ఎమ్మెల్యే అందజేశారు. కమ్మర్‌పల్లి మండల కేంద్రానికి చెందిన బాలేరావు అనసూర్యకు మోకాలి శస్త్రచికిత్స కోసం రూ.1.10 లక్షల విలువైన ఎల్‌ఓసీని వేల్పూర్‌లోని తన నివాసంలో బాధిత కుటుంబ సభ్యులకు అందించారు. ఇద్దరు బాధితులకు కలిపి మొత్తం రూ.2.20 లక్షల ఆర్థిక సహాయం అందేలా చర్యలు తీసుకున్నారు.
ఈ సందర్భంగా వేముల ప్రశాంత్ రెడ్డి మాట్లాడుతూ, బాధితులిద్దరూ మెరుగైన వైద్యం పొందుతూ త్వరగా సంపూర్ణ ఆరోగ్యంతో కోలుకోవాలని ఆకాంక్షించారు.వైద్య చికిత్స కోసం ఆర్థిక సహాయం అందేలా కృషి చేసి, ఎల్‌ఓసీలు మంజూరు చేయించిన ఎమ్మెల్యే వేముల ప్రశాంత్ రెడ్డికి బాధితుల కుటుంబ సభ్యులు కృతజ్ఞతలు తెలిపారు.
