Breaking News

నిషితా ఇంటర్నేషనల్ స్కూల్‌లో ఘనంగా బతుకమ్మ, దాండియా వేడుకలు

తెలంగాణ సంస్కృతి, సంప్రదాయాలను ప్రతిబింబించేలా సంబరాలు

నిజామాబాద్, అక్టోబర్ 12:(E6TV NEWS).

నిజామాబాద్ నగరంలోని నిషితా గ్రూప్ ఆఫ్ ఇన్‌స్టిట్యూషన్స్ ఆధ్వర్యంలో నిషితా ఇంటర్నేషనల్ స్కూల్‌లో సోమవారం బతుకమ్మ పండుగ, దాండియా వేడుకలను ఘనంగా నిర్వహించారు. తెలంగాణ సంస్కృతి, సంప్రదాయాల గొప్పతనాన్ని విద్యార్థులకు తెలియజేయడంతో పాటు, వారిలో సంప్రదాయాల పట్ల గౌరవం, సాంస్కృతిక అవగాహన పెంపొందించడమే లక్ష్యంగా ఈ కార్యక్రమాన్ని నిర్వహించారు.

ఈ వేడుకల్లో విద్యార్థులు, ఉపాధ్యాయులు, పాఠశాల సిబ్బంది ఉత్సాహంగా పాల్గొన్నారు. బతుకమ్మ పండుగ ప్రత్యేకతను చాటిచెబుతూ సంప్రదాయబద్ధంగా వేడుకలు నిర్వహించగా, దాండియా నృత్యాలు ప్రత్యేక ఆకర్షణగా నిలిచాయి. విద్యార్థుల ఉత్సాహభరితమైన ప్రదర్శనలు కార్యక్రమానికి మరింత శోభను తీసుకొచ్చాయి. ఇలాంటి కార్యక్రమాలు విద్యార్థుల్లో సృజనాత్మకత, ఐకమత్యం, పరస్పర సహకారం, సాంస్కృతిక విలువలను పెంపొందిస్తాయని నిర్వాహకులు పేర్కొన్నారు.ఈ కార్యక్రమానికి పాఠశాల మేనేజ్‌మెంట్ చీఫ్ ప్యాట్రన్ వినయ్ కుమార్, చైర్మన్ నిఖిల్, డైరెక్టర్ పూజ, కోఆర్డినేటర్ రాజు, ప్రిన్సిపల్ దియా బెనర్జీతో పాటు ముఖ్య అతిథిగా నగర మేయర్ ఉమారాణి హాజరయ్యారు. విద్యార్థులు మన సంస్కృతి, సంప్రదాయాలను గౌరవిస్తూ వాటి గొప్పతనాన్ని భావితరాలకు అందించే బాధ్యతను గుర్తించాలని పాఠశాల యాజమాన్యం ఆకాంక్షించింది.

బతుకమ్మ పండుగ తెలంగాణ ఆత్మగౌరవానికి, మహిళల సాంస్కృతిక వైభవానికి ప్రతీకగా నిలుస్తుందని, ఇలాంటి వేడుకలు విద్యార్థులకు మన సంప్రదాయాలపై అవగాహన కల్పిస్తాయని నిర్వాహకులు తెలిపారు. ఈ సందర్భంగా విద్యార్థులు, తల్లిదండ్రులు, ఉపాధ్యాయులు, శ్రేయోభిలాషులకు పాఠశాల మేనేజ్‌మెంట్, ప్రిన్సిపల్, ఉపాధ్యాయ బృందం బతుకమ్మ, దసరా పండుగ శుభాకాంక్షలు తెలియజేశారు.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *