Breaking News

భైంసా ప్రాజెక్టు పరిధిలో సర్టిఫికెట్ల వెరిఫికేషన్ పూర్తి

న్యూ ఆబాది కేటగిరీకి ఈ నెల 14న ధ్రువీకరణ.. హాజరుకాని వారికి 16న ప్రత్యేక అవకాశం

భైంసా, అక్టోబరు 13 (E6tv NEWS).

భైంసా ప్రాజెక్టు పరిధిలోని భైంసా, కుంటాల మండలాలకు చెందిన అభ్యర్థుల సర్టిఫికెట్ల వెరిఫికేషన్ ప్రక్రియను ICDS అధికారులు మంగళవారం పూర్తి చేశారు. ఈ ప్రక్రియలో అభ్యర్థులు తమ ఒరిజినల్ సర్టిఫికెట్లతో స్వయంగా హాజరై ధ్రువీకరణ చేయించుకున్నారు.

న్యూ ఆబాది కేటగిరీ కింద అందిన 228 దరఖాస్తులకు సంబంధించి ఈ నెల 14వ తేదీన సర్టిఫికెట్ల వెరిఫికేషన్ నిర్వహించనున్నట్లు భైంసా ప్రాజెక్టు CDPO వెల్లడించారు. ఇప్పటికే కుబీర్ మండలంలో ఈ నెల 6, 7 తేదీల్లో వెరిఫికేషన్ ప్రక్రియ పూర్తయిందని, భైంసా మండలంలో మంగళవారం ప్రక్రియను ముగించినట్లు తెలిపారు. వివిధ కారణాలతో నిర్ణీత తేదీల్లో వెరిఫికేషన్‌కు హాజరుకాలేకపోయిన వారు, ప్రస్తుతం పట్టణం వెలుపల ఉన్న అభ్యర్థుల కోసం ఈ నెల 16వ తేదీన ప్రత్యేకంగా ధ్రువీకరణ ప్రక్రియ పూర్తి చేసేందుకు ఏర్పాట్లు చేస్తున్నట్లు పేర్కొన్నారు.

సంబంధిత అభ్యర్థులు తమకు కేటాయించిన తేదీల్లో ఒరిజినల్ సర్టిఫికెట్లతో హాజరై వెరిఫికేషన్ ప్రక్రియను పూర్తి చేసుకోవాలని CDPO సూచించారు.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *