ఆంధ్రప్రదేశ్‌లో ఉపాధ్యాయ ఉద్యోగాల భర్తీకి సంబంధించి ఏపీ డీఎస్సీ (AP DSC 2026) ప్రాథమిక నోటిఫికేషన్‌ను విడుదల చేసినట్లు రాష్ట్ర ఐటీ, విద్యాశాఖ మంత్రి నారా లోకేశ్ బుధవారం ప్రకటించారు. మొత్తం 2,721 ఉపాధ్యాయ పోస్టులతో ఈ నోటిఫికేషన్ వెలువడగా, ఇందులో ప్రత్యేకంగా దివ్యాంగులు/ప్రత్యేక అవసరాలు గల పిల్లల కోసం 350 స్పెషల్ ఎడ్యుకేషన్ పోస్టులు కేటాయించినట్లు తెలిపారు. పూర్తి వివరాలతో కూడిన సమగ్ర (Detailed) నోటిఫికేషన్‌ను నవంబర్ 3 లేదా అంతకంటే ముందే విడుదల చేయనున్నట్లు స్పష్టం చేశారు.
ఈ నియామక ప్రక్రియకు సంబంధించిన దరఖాస్తులను కేవలం ఆన్‌లైన్ ద్వారా మాత్రమే స్వీకరిస్తామని, పరీక్షను కంప్యూటర్ ఆధారిత పరీక్ష (CBT) విధానంలో నిర్వహిస్తామని పేర్కొన్నారు. డీఎస్సీ సిలబస్ ఇప్పటికే అధికారిక వెబ్‌సైట్ (tet2dsc.apcfss.in)లో అందుబాటులో ఉందని, అభ్యర్థులు అక్కడి నుంచి డౌన్లోడ్ చేసుకొని ప్రిపరేషన్ ప్రారంభించాలని మంత్రి సూచించారు. అర్హతలు, కేటగిరీల వారీగా ఖాళీలు, దరఖాస్తు విధానం మరియు పరీక్ష షెడ్యూల్ తదితర పూర్తి వివరాలు నవంబర్ 3న వచ్చే తుది నోటిఫికేషన్‌లో వెల్లడించనున్నారు.
