విజయవాడ ఇంద్రకీలాద్రిపై వెలసిన ప్రసిద్ధ శ్రీ దుర్గా మల్లే్వర స్వామి దేవస్థానంలో రాష్టపతి ద్రౌపది ముర్ము బుధవారం సాయంత్రం ప్రత్యేక పూజలు నిర్వహించారు. విజయవాడ గన్నవరం విమానాశ్రయానికి ప్రత్యేక విమానంలో చేరుకున్న ఆమెకు గవర్నర్ ఎస్. అబ్దుల్ నజీర్, కేంద్ర మంత్రులు పెమ్మసాని చంద్రశేఖర్, కమలేశ్ పాశ్వాన్ ఘన స్వాగతం పలికారు.
అనంతరం కొండపైకి చేరుకున్న రాష్ట్రపతికి ఆలయ అర్చకులు వేద మంత్రాలతో సంప్రదాయబద్ధంగా స్వాగతం పలికారు. గర్భాలయంలో శ్రీ మహా చండీ దేవి అలంకారంలో ఉన్న కనకదుర్గ అమ్మవారిని దర్శించుకుని ఆమె ప్రత్యేక పూజలు చేశారు. ఈ కార్యక్రమంలో రాష్ట్ర మంత్రులు కొల్లు రవీంద్ర, వంగలపూడి అనిత, ఆలయ ట్రస్ట్ బోర్డు చైర్మన్ బొర్రా రాధాకృష్ణ తదితరులు పాల్గొన్నారు. దర్శన అనంతరం వేద పండితులు రాష్ట్రపతిని ఆశీర్వదించి తీర్థప్రసాదాలు అందజేశారు.
