‘మార్చ్ ఫర్ డెమోక్రసీ’, ‘ఓట్ చోరీ’ నిరసనల్లో పాల్గొన్నందుకు అభినందన
ఎల్లారెడ్డి, అక్టోబర్ 14 (E6tv న్యూస్): ఢిల్లీలో ఏఐసీసీ అధ్యక్షుడు, రాజ్యసభలో ప్రతిపక్ష నేత మల్లికార్జున ఖర్గేను టీపీసీసీ ఎస్సీ విభాగం రాష్ట్ర ప్రధాన కార్యదర్శి గుల్లాని సాయిలు మర్యాదపూర్వకంగా కలిశారు. ఈ సందర్భంగా ఖర్గే ఆశీస్సులు తీసుకున్నారు.ఢిల్లీలో కాంగ్రెస్ పార్టీ నిర్వహించిన ‘మార్చ్ ఫర్ డెమోక్రసీ’, ‘ఓట్ చోరీ’ నిరసన కార్యక్రమాల్లో గుల్లాని సాయిలు చురుగ్గా పాల్గొన్నారు. ఈ నేపథ్యంలో ఆయనను మల్లికార్జున ఖర్గే అభినందించినట్లు తెలిపారు.
ప్రజాస్వామ్య పరిరక్షణతో పాటు రాజ్యాంగ విలువల కాపాడటానికి కాంగ్రెస్ పార్టీ చేపడుతున్న కార్యక్రమాల్లో మరింత చురుగ్గా పాల్గొనాలని ఖర్గే సూచించినట్లు పేర్కొన్నారు. పార్టీ బలోపేతానికి క్రమశిక్షణతో, అంకితభావంతో పనిచేస్తూ ప్రజలకు మరింత చేరువ కావాలని గుల్లాని సాయిలుకు దిశానిర్దేశం చేసినట్లు తెలిపారు.ఈ భేటీతో పార్టీ శ్రేణుల్లో ఉత్సాహం నెలకొందని కాంగ్రెస్ నాయకులు పేర్కొన్నారు.


