Breaking News

మెట్‌పల్లి ప్రెస్ క్లబ్ ప్రగాఢ సంతాపం

మెట్‌పల్లి, అక్టోబర్ 16 (E6tv న్యూస్):

మెట్‌పల్లి పట్టణానికి చెందిన సీనియర్ పాత్రికేయులు, టీయూడబ్ల్యూజే (ఐజేయూ) మెట్‌పల్లి ప్రెస్ క్లబ్ ఉపాధ్యక్షులు జంగం విజయ్ అనారోగ్యంతో కన్నుమూశారు. జగిత్యాల జిల్లా కేంద్రంలోని ఆసుపత్రిలో చికిత్స పొందుతూ శుక్రవారం తుదిశ్వాస విడిచారు. ఆయన మృతితో మెట్‌పల్లి పాత్రికేయ రంగంలో విషాదం నెలకొంది.సుదీర్ఘకాలంగా పాత్రికేయ రంగంలో సేవలందించిన జంగం విజయ్ మృతి పట్ల జర్నలిస్టు సంఘాల ప్రతినిధులు తీవ్ర దిగ్భ్రాంతి వ్యక్తం చేశారు. సహచర పాత్రికేయుడిని కోల్పోవడం బాధాకరమని, ఆయన మరణం పాత్రికేయ రంగానికి తీరని లోటని పేర్కొన్నారు.

ఈ సందర్భంగా టీయూడబ్ల్యూజే (ఐజేయూ) మెట్‌పల్లి ప్రెస్ క్లబ్ అధ్యక్షుడు బూరం సంజీవ్, కార్యదర్శి మహమ్మద్ అజీమ్ మాట్లాడుతూ.. జంగం విజయ్ మృతి పట్ల తీవ్ర విచారం వ్యక్తం చేశారు. ఆయన కుటుంబ సభ్యులకు ప్రగాఢ సానుభూతి తెలియజేస్తూ, ఈ విషాద సమయంలో కుటుంబ సభ్యులకు మనోధైర్యం కలగాలని ఆకాంక్షించారు.

జంగం విజయ్ ఆత్మకు శాంతి చేకూరాలని ప్రార్థించారు. ఆయన కుటుంబానికి తమ సంఘం అండగా ఉంటుందని, వారి దుఃఖంలో భాగస్వాములమవుతున్నామని తెలిపారు.జంగం విజయ్ మృతి పట్ల టీయూడబ్ల్యూజే (ఐజేయూ) మెట్‌పల్లి ప్రెస్ క్లబ్ ప్రతినిధులు ప్రగాఢ సంతాపం వ్యక్తం చేశారు.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *