Breaking News

బీజేపీ ఎస్టీ మోర్చా జిల్లా ఉపాధ్యక్షులుగా రామావత్ దేవిసింగ్

ఎల్లారెడ్డి, అక్టోబర్ 16 (E6tv న్యూస్).

కామారెడ్డి జిల్లా భారతీయ జనతా పార్టీ ఎస్టీ మోర్చా జిల్లా ఉపాధ్యక్షులుగా మాజీ ఎంపీటీసీ రామావత్ దేవిసింగ్ నియమితులయ్యారు. ఈ మేరకు జిల్లా అధ్యక్షుడు నీలం చిన్నరాజులు నియామక ఉత్తర్వులు జారీ చేశారు.రామావత్ దేవిసింగ్ గతంలో సర్పంచ్‌గా రెండు పర్యాయాలు, ఎంపీటీసీగా, సొసైటీ వైస్‌ చైర్మన్‌గా పనిచేస్తూ ప్రజలకు సేవలందించారు. గ్రామస్థాయి నుంచి రాజకీయాల్లో చురుకుగా పాల్గొంటూ ప్రజలతో సత్సంబంధాలను కొనసాగించారు.

ఈ సందర్భంగా దేవిసింగ్ మాట్లాడుతూ, పార్టీ తనకు అప్పగించిన బాధ్యతలను సమర్థవంతంగా నిర్వహిస్తూ భారతీయ జనతా పార్టీ బలోపేతానికి నిరంతరం కృషి చేస్తానని తెలిపారు. తనపై నమ్మకంతో జిల్లా ఉపాధ్యక్ష పదవి బాధ్యతలు అప్పగించిన జిల్లా అధ్యక్షుడు నీలం చిన్నరాజులు, రాష్ట్ర కార్యవర్గ సభ్యుడు పైడి ఎల్లారెడ్డితో పాటు పార్టీ నాయకులు, కార్యకర్తలకు కృతజ్ఞతలు తెలియజేశారు.దేవిసింగ్ నియామకం పట్ల బీజేపీ శ్రేణులు హర్షం వ్యక్తం చేశాయి.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *