News
శ్రీ గజముఖ గణేష్ మండలి ఆధ్వర్యంలో ఆటల పోటీలు
ముగ్గుల పోటీలతో పాటు పలు ఆటల పోటీలు.. విజేతలకు బహుమతులు వర్ని, సెప్టెంబర్ 25:(E6tv NEWS: ప్రతినిధి). నిజామాబాద్ జిల్లా వర్ని మండలం పాత వర్ని గ్రామంలో శ్రీ గజముఖ గణేష్ మండలి ఆధ్వర్యంలో ఆడపడుచులకు ఆటల పోటీలు నిర్వహించారు. వర్ని మార్కెట్ కమిటీ చైర్మన్ సురేష్ బాబా ఆధ్వర్యంలో నిర్వహించిన ఈ కార్యక్రమంలో మహిళలకు ముగ్గుల పోటీలతో పాటు పలు రకాల ఆటల పోటీలు నిర్వహించారు.ఈ సందర్భంగా పోటీల్లో ప్రతిభ కనబరిచి విజయం సాధించిన మహిళలకు…
ఘనంగా లయన్ పత్తి రాము జన్మదిన వేడుకలు
కంటి ఆసుపత్రి రోగులకు అన్నదానం రుద్రూర్, సెప్టెంబర్ 25:(E6tv NEWS: ప్రతినిధి) లయన్స్ క్లబ్ ఆఫ్ రుద్రూర్ వ్యవస్థాపక సభ్యులు, మాజీ సొసైటీ చైర్మన్ లయన్ పత్తి రాము జన్మదిన వేడుకలను గురువారం ఘనంగా నిర్వహించారు. ఆయన జన్మదినాన్ని పురస్కరించుకుని బోధన్‌లోని లయన్స్ కంటి ఆసుపత్రిలో కంటి ఆపరేషన్లు చేయించుకున్న రోగులు, వారి సహాయకులకు రుచికరమైన భోజనాన్ని అందించారు.ఈ సందర్భంగా లయన్ పత్తి రాము మాట్లాడుతూ తన జన్మదినం సందర్భంగా క్లబ్ సభ్యులు సేవా కార్యక్రమం నిర్వహించడం…
భైంసాలో శాంతియుతంగా ముగిసిన గణేష్ నిమజ్జనోత్సవం
జిల్లా ఎస్పీకి మున్సిపల్ కౌన్సిలర్ల కృతజ్ఞతలు భైంసా, సెప్టెంబర్ 25:(E6tv NEWS: ప్రతినిధి). పట్టణంలో గణేష్ నిమజ్జనోత్సవం ఎలాంటి అవాంఛనీయ ఘటనలకు తావులేకుండా శాంతియుతంగా, శోభాయమానంగా విజయవంతంగా ముగిసింది. ఈ సందర్భంగా భైంసా మున్సిపల్ కౌన్సిలర్లు జిల్లా పోలీసు కార్యాలయంలో జిల్లా ఎస్పీ డా. జి. జానకి షర్మిల, IPSను మర్యాదపూర్వకంగా కలిసి సన్మానించి కృతజ్ఞతలు తెలిపారు.నిమజ్జనోత్సవం సందర్భంగా పోలీస్ శాఖ చేపట్టిన పటిష్టమైన భద్రతా ఏర్పాట్లు, బందోబస్తు, ట్రాఫిక్ నియంత్రణ, నిరంతర పర్యవేక్షణతో పాటు ముందస్తు…
హుడా కాలనీలో ఘనంగా అన్న సమారాధన
శేర్లింగంపల్లి, సెప్టెంబర్ 25(E6TV న్యూస్):శేర్లింగంపల్లి పరిధిలోని హుడా కాలనీలో గణేష్ ఉత్సవ కమిటీ ఆధ్వర్యంలో గురువారం అన్న సమారాధన (అన్నదానం) కార్యక్రమాన్ని ఘనంగా నిర్వహించారు. గణేష్ మండపం వద్ద నిర్వహించిన ఈ కార్యక్రమానికి భక్తులు, స్థానికులు, రాజకీయ నాయకులు పెద్ద సంఖ్యలో హాజరయ్యారు. సుమారు 3,000 మందికి పైగా భక్తులు అన్న సమారాధనలో పాల్గొని స్వామివారి తీర్థప్రసాదాలు స్వీకరించినట్లు ఉత్సవ కమిటీ సభ్యులు తెలిపారు. భక్తులకు ఎలాంటి ఇబ్బందులు కలగకుండా కమిటీ సభ్యులు ఏర్పాట్లు చేశారు.ఈ కార్యక్రమంలో…
నకిలీ పనీర్‌పై కేంద్రం ఉక్కుపాదం: పట్టుబడితే కోలుకోలేని దెబ్బ!
పాలు, పాల పదార్థాలతో తయారు చేయని కృత్రిమ ఉత్పత్తులకు (Non-Dairy Products) “పనీర్” అనే పేరును ఉపయోగించకుండా నిషేధించాలని భారత ఆహార భద్రత, ప్రమాణాల ప్రాధికార సంస్థ (FSSAI) కీలక ముసాయిదా ప్రతిపాదనను సిద్ధం చేసింది. పనీర్‌ను పోలి ఉండే నాన్-డెయిరీ ప్రత్యామ్నాయ ఉత్పత్తుల ప్యాకెట్లపై “పనీర్” అని ముద్రించడం వల్ల సాధారణ వినియోగదారులు తీవ్రంగా మోసపోతున్నారని, అందుకే ఈ ప్రత్యామ్నాయాలకు మార్కెట్లో విడిగా ఇతర పేర్లను మాత్రమే ఉపయోగించాలని స్పష్టం చేసింది. సాధారణంగా మార్కెట్లో లభించే…
తప్పుడు కేసులతో వేధింపులు.. చర్యలు తీసుకోవాలని తాళ్ల రాంపూర్ గ్రామస్థుల విజ్ఞప్తి
తాళ్ల రాంపూర్, సెప్టెంబర్ 24:(E6tv NEWS: ప్రతినిధి).తాళ్ల రాంపూర్ గ్రామంలో కొందరు వ్యక్తులు తప్పుడు కేసులు, ఫిర్యాదులతో తమను వేధిస్తున్నారని ఆరోపిస్తూ గ్రామస్థులు పోలీసులను ఆశ్రయించారు. తమపై జరుగుతున్న వేధింపులను అరికట్టి, బాధ్యులపై తగిన చర్యలు తీసుకోవాలని కోరారు. తాళ్ల రాంపూర్ పీఏసీఎస్ ఫంక్షన్ హాల్లో జిల్లా జడ్జి, కమిషనర్ ఆఫ్ పోలీస్ ఆధ్వర్యంలో నిర్వహించిన అవగాహన కార్యక్రమం అనంతరం గ్రామ కమిటీని రద్దు చేసినట్లు గ్రామస్థులు తెలిపారు. అయితే గ్రామంలో ఏర్పడిన సమస్యలపై ఇప్పటివరకు ఎలాంటి…
సైబరాబాద్‌లో 1.03 లక్షల విగ్రహాలు నిమజ్జనాలు పూర్తి!
హైదరాబాద్‌లోని సైబరాబాద్ మున్సిపల్ కార్పొరేషన్ (CMC) పరిధిలో వినాయక నిమజ్జనోత్సవాలు అత్యంత వైభవంగా, ప్రశాంత వాతావరణంలో కొనసాగుతున్నాయి. గురువారం, శుక్రవారాల్లో మరిన్ని విగ్రహాల నిమజ్జనాలు జరుగుతాయని భావిస్తున్న నేపథ్యంలో, అధికారులు నిమజ్జన ఘాట్ల వద్ద విస్తృత ఏర్పాట్లు చేపట్టారు. రికార్డు స్థాయిలో నిమజ్జనాలు: అధికారిక నివేదికల ప్రకారం.. సెప్టెంబర్ 23 నాటికి సైబరాబాద్ కమిషనరేట్ పరిధిలో దాదాపు 1,03,149 గణేశ్ విగ్రహాల నిమజ్జనం విజయవంతంగా పూర్తయింది. తుది విడత శోభాయాత్రలు, నిమజ్జనాలు కొనసాగుతున్నందున ఈ సంఖ్య మరింత…
క్రీడలకు ఆర్డీటీ మంచు ఫెర్రర్ ఒక వరం
క్రికెట్లో రాణించి జిల్లా, రాష్ట్రానికి పేరు తీసుకురావాలి రాయదుర్గంలో క్రికెట్ సెలక్షన్స్‌కు భారీ స్పందన రాయదుర్గం, సెప్టెంబర్ 24:(E6tv NEWS: ప్రతినిధి). కరువు నేల అనంతపురం జిల్లాలో గ్రామీణ ప్రాంతాల క్రీడాకారులను ప్రోత్సహిస్తూ, ప్రతిభను వెలికితీసేందుకు ఆర్డీటీ చేపడుతున్న కార్యక్రమాలు అభినందనీయమని ప్రభుత్వ విప్, రాయదుర్గం ఎమ్మెల్యే కాలువ శ్రీనివాసులు అన్నారు. క్రీడలకు ఆర్డీటీ, మంచు ఫెర్రర్ వంటి సంస్థలు అందిస్తున్న ప్రోత్సాహం ఒక వరం లాంటిదని పేర్కొన్నారు. క్రికెట్లో రాణించి జిల్లా, రాష్ట్ర స్థాయిలో ఎంపికై…
ఎర్రవల్లి సర్వేలో కొత్త ట్విస్ట్: అధికారుల నోటీసులను రిజెక్ట్ చేసిన రైతులు!
సిద్దిపేట జిల్లా ఎర్రవల్లి పరిధిలోని సర్వే నెంబర్ 325లో ఉన్న భూముల వివరాల పరిశీలన కోసం రెవెన్యూ అధికారులు నిర్వహిస్తున్న క్షేత్రస్థాయి సర్వే గురువారం ఏడో రోజుకు చేరింది. ఏడీ సుదర్శన్, డీఐ సేవియా నాయక్ ఆధ్వర్యంలో రెండు ప్రత్యేక బృందాలుగా ఏర్పడిన అధికారులు భూముల కొలతలు చేపడుతూ, రికార్డులను క్షుణ్ణంగా తనిఖీ చేస్తున్నారు. అధికారుల నోటీసులను తిరస్కరించిన రైతులు: ఒకవైపు అధికారులు సర్వే ప్రక్రియ వేగవంతం చేస్తుండగా, మరోవైపు శివారు వెంకటాపూర్ గ్రామానికి చెందిన రైతులు…
పోలీసు వాహనాన్ని ఢీకొట్టిన లారీ.. : ఖమ్మం
ఖమ్మం జిల్లా తిరుమలాయపాలెం మండలంలో గురువారం విషాదకర రోడ్డు ప్రమాదం చోటుచేసుకుంది. బందోబస్తు విధులు ముగించుకుని తిరిగి వస్తున్న తిరుమలాయపాలెం పోలీస్ స్టేషన్ వాహనాన్ని ఒక వేగంగా వచ్చిన లారీ బలంగా ఢీకొట్టింది. పోలీస్ వాహనం నుజ్జునుజ్జు: మండలంలో వినాయక నిమజ్జన వేడుకల సందర్భంగా వివిధ గ్రామాల్లో పోలీసులు బందోబస్తు విధులు నిర్వహించారు. డ్యూటీ పూర్తయిన తర్వాత ఎస్ఐ కూచిపూడి జగదీష్, వాహన డ్రైవర్‌తో కలిసి పిండిప్రోలు గ్రామం నుంచి తిరుమలాయపాలెం పోలీస్ స్టేషన్‌కు వాహనంలో తిరిగి…
