Breaking News

శ్రీ గజముఖ గణేష్ మండలి ఆధ్వర్యంలో ఆటల పోటీలు

ముగ్గుల పోటీలతో పాటు పలు ఆటల పోటీలు.. విజేతలకు బహుమతులు

వర్ని, సెప్టెంబర్ 25:(E6tv NEWS: ప్రతినిధి).

నిజామాబాద్ జిల్లా వర్ని మండలం పాత వర్ని గ్రామంలో శ్రీ గజముఖ గణేష్ మండలి ఆధ్వర్యంలో ఆడపడుచులకు ఆటల పోటీలు నిర్వహించారు. వర్ని మార్కెట్ కమిటీ చైర్మన్ సురేష్ బాబా ఆధ్వర్యంలో నిర్వహించిన ఈ కార్యక్రమంలో మహిళలకు ముగ్గుల పోటీలతో పాటు పలు రకాల ఆటల పోటీలు నిర్వహించారు.ఈ సందర్భంగా పోటీల్లో ప్రతిభ కనబరిచి విజయం సాధించిన మహిళలకు నిర్వాహకులు బహుమతులను అందజేశారు. గణేష్ ఉత్సవాల్లో భాగంగా మహిళల్లో ఉత్సాహాన్ని పెంపొందించడంతో పాటు, వారి ప్రతిభను ప్రోత్సహించే ఉద్దేశంతో ఈ పోటీలు నిర్వహించినట్లు నిర్వాహకులు తెలిపారు.కార్యక్రమంలో గణేష్ మండలి సభ్యులు తరుణ్, దత్తు, రాజు, రాము, అనిల్, నవీన్, ప్రవీణ్, దినేష్ తదితరులు పాల్గొన్నారు.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *