Hyderabad
కాంగ్రెస్ ప్రభుత్వం రైతులను మోసం చేసింది: ధన్పాల్ సూర్యనారాయణ
ఇందూరు, సెప్టెంబర్ 29: (E6tv NEWS: శివ ఠాకూర్) ఎన్నికల ముందు రైతులకు ఇచ్చిన హామీలను కాంగ్రెస్ ప్రభుత్వం నెరవేర్చకుండా మోసం చేసిందని నిజామాబాద్ అర్బన్ ఎమ్మెల్యే ధన్పాల్ సూర్యనారాయణ ఆరోపించారు. రైతులకు ఇచ్చిన హామీలను అమలు చేయాలని డిమాండ్ చేస్తూ బీజేపీ కిసాన్ మోర్చా ఆధ్వర్యంలో చేపట్టిన సైకిల్ యాత్ర మంగళవారం నిజామాబాద్ అర్బన్‌కు చేరుకుంది. ఈ సందర్భంగా ఎమ్మెల్యే మాట్లాడుతూ.. వరంగల్ డిక్లరేషన్‌లో రాహుల్ గాంధీ సమక్షంలో రైతులకు ఇచ్చిన హామీల్లో ఒక్కటీ పూర్తిస్థాయిలో…
8వ వార్డులో తాగునీటి సమస్యకు పరిష్కారం దిశగా నూతన బోరు
మంత్రి సత్యకుమార్ యాదవ్ ఆదేశాలతో పనులు ప్రారంభం 100 అడుగుల లోతులోనే నీటి లభ్యత.. 3 ఇంచుల మేర నీరు ధర్మవరం, సెప్టెంబర్ 29:(E6tv NEWS:ప్రతినిధి) ధర్మవరం పట్టణంలోని 8వ వార్డులో తాగునీటి సమస్యకు పరిష్కారం చూపే దిశగా నూతన బోరు ఏర్పాటు పనులు ప్రారంభమయ్యాయి. వార్డులో నెలకొన్న నీటి సమస్యను స్థానికులు రాష్ట్ర వైద్య, ఆరోగ్య, కుటుంబ సంక్షేమ మరియు వైద్య విద్య శాఖ మంత్రి, ధర్మవరం ఎమ్మెల్యే సత్యకుమార్ యాదవ్ దృష్టికి తీసుకెళ్లారు. ప్రజల…
బదిరులకు అండగా ఉంటా: అర్బన్ ఎమ్మెల్యే ధన్పాల్
ఇందూరు, సెప్టెంబర్ 29:(E6tv NEWS: ప్రతినిధి) జిల్లాలోని బదిరులకు తాను ఎల్లప్పుడూ అండగా ఉంటానని అర్బన్ ఎమ్మెల్యే ధన్పాల్ సూర్యనారాయణ గుప్తా తెలిపారు. డెఫ్ ఎంప్లాయీస్ అసోసియేషన్ ఆధ్వర్యంలో మంగళవారం నగరంలోని న్యూ అంబేద్కర్ భవన్లో అంతర్జాతీయ సంకేత భాషా దినోత్సవాన్ని నిర్వహించారు. ఈ సందర్భంగా ఎమ్మెల్యే ధన్పాల్ మాట్లాడుతూ బదిరుల్లో ఎంతో మేధాశక్తి, ప్రతిభ దాగి ఉంటుందని అన్నారు. సాధారణ వ్యక్తులతో సమానంగా పోటీ ప్రపంచంలో ముందుకు సాగుతున్న బదిరులను అభినందించారు. బదిరులుగా ఉంటూనే ప్రభుత్వ…
కేజీబీవీ విద్యార్థులకు 35 డబుల్ డెస్క్ బెంచీల పంపిణీ
భీంగల్, సెప్టెంబర్ 29:(E6tv NEWS: ప్రతినిధి) విద్యార్థుల సౌకర్యార్థం భీంగల్ కస్తూర్బా గాంధీ బాలికల విద్యాలయం (కేజీబీవీ)కు 35 డబుల్ డెస్క్ బెంచీలను పంపిణీ చేశారు. మాజీ మంత్రి, ఎమ్మెల్యే వేముల ప్రశాంత్ రెడ్డి కృషితో పారిశ్రామికవేత్త దయానంద్ రెడ్డి ఈ బెంచీలను అందజేశారు. విద్యార్థులకు మెరుగైన విద్యా వసతులు కల్పించాలనే ఉద్దేశంతో డబుల్ డెస్క్ బెంచీలను అందించడం పట్ల పాఠశాల నిర్వాహకులు, విద్యార్థులు హర్షం వ్యక్తం చేశారు. విద్యార్థుల అవసరాలను గుర్తించి వసతుల కల్పనకు సహకరించిన…
ఆర్మీ చీఫ్‌తో మంత్రి ఉత్తమ్ భేటీ:ప్రాజెక్టుల పునరుద్ధరణకు ప్లాన్
శ్రీశైలం ఎడమ కాలువ (SLBC) టన్నెల్ నిర్మాణం, మేడిగడ్డ, అన్నారం, సుందిళ్ల బ్యారేజీల పునరుద్ధరణ పనులను వేగవంతం చేసేందుకు తెలంగాణ ప్రభుత్వం కీలక నిర్ణయం తీసుకుంది. భారత సైన్యానికి చెందిన ఇంజినీరింగ్ విభాగం అధికారుల సేవలను వినియోగించుకోవాలని నిర్ణయించింది. ఈ మేరకు తెలంగాణ నీటిపారుదల శాఖ మంత్రి ఉత్తమ్ కుమార్ రెడ్డి న్యూఢిల్లీలో ఆర్మీ చీఫ్ జనరల్ ధీరజ్ సేత్తో ప్రత్యేకంగా సమావేశమై అభ్యర్థించారు. రక్షణ మంత్రిత్వ శాఖ స్పందిస్తూ లెఫ్టినెంట్ కర్నల్ సత్యదేవ్ సింగ్, లెఫ్టినెంట్…
“ఆధారాలు బయటపెడతా”: KTR పై కవిత ఘాటు వ్యాఖ్యలు!
నియోజకవర్గానికి ఎమ్మెల్యేనే సీఎం అని కేసీఆర్ చెప్పడం వల్లే సమస్యలు తమ వరకు రాలేదని బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ చేసిన వ్యాఖ్యలపై ఆల్ ఇండియా ఫార్వర్డ్ బ్లాక్ నేత (మాజీ ఎమ్మెల్సీ) కవిత ఎక్స్ (ట్విట్టర్) వేదికగా తీవ్రంగా మండిపడ్డారు. కూర్చున్న కొమ్మనే నరుక్కున్నట్లుగా కేటీఆర్ తన సొంత వైఫల్యాలను బీఆర్ఎస్ అధినేత కేసీఆర్‌పై తోసిపుచ్చుతున్నారని విమర్శించారు. బీఆర్ఎస్లో ఉన్నప్పుడు తాను ఒక అవినీతి నాయకుడిని విమర్శిస్తే సస్పెండ్ చేశారని, ఇప్పుడు అదే నాయకుడితో కేటీఆర్…
హైదరాబాద్ సెంట్రల్ యూనివర్సిటీ ఎలక్షన్స్: నేడే ఫలితాల వెల్లడి
హైదరాబాద్ సెంట్రల్ యూనివర్సిటీ (UoH) విద్యార్థి యూనియన్ ఎన్నికల ఓట్ల లెక్కింపు ప్రక్రియ ప్రారంభమైంది. సోమవారం అత్యంత ఉత్కంఠభరితంగా, ప్రశాంత వాతావరణంలో ముగిసిన పోలింగ్‌లో దాదాపు 5,900 మంది విద్యార్థులకు గానూ 80 శాతానికి పైగా ఓటింగ్ నమోదైంది. మొత్తం 9 కేంద్ర పదవులతో పాటు 13 స్కూళ్ల పరిధిలోని 59 స్కూల్ బోర్డు కౌన్సిలర్ స్థానాల కోసం 220 మంది అభ్యర్థులు బరిలో నిలిచారు. మంగళవారం మధ్యాహ్నం నుంచి ఓట్ల లెక్కింపును ప్రారంభించామని, రాత్రికి ఫలితాలను…
బొగ్గు దిగుమతిపై KTR ఫైర్: టన్ను రూ.9 వేల కొనుగోలుపై ఆగ్రహం!
సింగరేణి బొగ్గు టన్నుకు రూ.3,800 అందుబాటులో ఉండగా, విదేశాల నుంచి టన్నుకు రూ.9,000 పెట్టి బొగ్గును దిగుమతి చేసుకోవాలని కాంగ్రెస్ ప్రభుత్వం భావించడంపై బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ తీవ్రంగా మండిపడ్డారు. కాంగ్రెస్ ప్రభుత్వ తీరును ‘తుగ్లక్ నిర్ణయం’గా అభివర్ణించిన ఆయన, ఎవరి స్వలాభం కోసం ఈ నిర్ణయం తీసుకుంటున్నారని, ప్రజలపై ఈ భారాన్ని ఎందుకు మోపుతున్నారని ప్రశ్నించారు. కేసీఆర్ నాయకత్వంలోని బీఆర్ఎస్ హయాంలో సింగరేణి బొగ్గుతోనే రాష్ట్రానికి 24 గంటల విద్యుత్‌ను నిరంతరాయంగా అందించామని ఈ…
అభివృద్ధి ముసుగులో భూసేకరణ: రేవంత్ ప్రభుత్వంపై కేటీఆర్
హైదరాబాద్‌లో బుల్లెట్ ట్రైన్ ప్రాజెక్టు పేరుతో కాంగ్రెస్ ప్రభుత్వం పెద్ద ఎత్తున రియల్ ఎస్టేట్ కుంభకోణానికి పాల్పడుతోందని బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ తీవ్ర ఆరోపణలు చేశారు. బహదూర్‌పల్లిలో తరతరాలుగా సాగు చేసుకుంటున్న రైతుల వ్యవసాయ భూములను అక్రమంగా తీసుకోవడాన్ని ఆయన తీవ్రంగా వ్యతిరేకించారు. తమ పార్టీ అభివృద్ధికి గానీ, బుల్లెట్ ట్రైన్ ప్రాజెక్టుకు గానీ వ్యతిరేకం కాదని, అయితే రైతుల భూములను లాక్కుంటే చూస్తూ ఊరుకోబోమని స్పష్టం చేశారు. శంషాబాద్ విమానాశ్రయం వద్ద వేలాది ఎకరాల…
నిమ్స్‌లో ఏసీబీ కలకలం: అధికారుల ఇళ్లలో ముమ్మర సోదాలు!
హైదరాబాద్ నిజాం ఇన్స్టిట్యూట్ ఆఫ్ మెడికల్ సైన్సెస్ (NIMS) అదనపు మెడికల్ సూపరింటెండెంట్ డాక్టర్ నోరి లక్ష్మీ భాస్కర్ ఆదాయానికి మించిన ఆస్తుల కేసులో అవినీతి నిరోధక శాఖ (ACB) సోదాలు ముమ్మరం చేసింది. దర్యాప్తులో భాగంగా మంగళవారం ఉదయం నిమ్స్ ఆసుపత్రిలోని పలువురు ఉద్యోగుల ఇళ్లలో అధికారులు సోదాలు నిర్వహించి రూ.7 లక్షల నగదును స్వాధీనం చేసుకున్నారు. ఇటీవలే లక్ష్మీ భాస్కర్‌ను అరెస్ట్ చేసి రిమాండ్‌కు తరలించిన ఏసీబీ, ఆయన నివాసంతో పాటు బంధువులు, బినామీల…
